పుట:Geetha parichayam Total Book.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పురాణములలోని విషయములు వేరని, శాస్త్రములలోని విషయములు వేరని తేల్చి చెప్పువారున్నప్పటికి, వాటి తేడాను వివరిస్తున్నప్పటికి, మొదట కాదని కొంతకాలమునకు తమ మనసులో సత్యమును గ్రహించిన వారు పురాణములను విడువలేక పైకి అన్ని ఒకే దారి చూపుచున్నవి, ఏమీ తేడాలేదని చెప్పుకొనువారు గలరు. పురాణములను బోధించుచు పురాణములలో ఎంతో పేరుగాంచిన వారు, పురాణములు కాలక్షేపమునకే గాని కర్మక్షేపమునకు పనికి రావని, చివరికి తెలిసి కూడ మధ్యలో పురాణముల గూర్చి తక్కువగ చెప్పితే, ఇంతవరకు గొప్పవని చెప్పిన తమకు విలువుండదని, బయటికి వాటిని గొప్పగనే చెప్పుచుందురు. కొంత మనసులో పురాణముల కంటే శాస్త్రములు గొప్పవని తోచుచున్నప్పటికి, తమ బయటి గౌరవము కొరకు పురాణములను విడువలేని వారు చాలామంది కలరు. మనుషులను ఇంతగ చిక్కుబెట్టు పురాణములను, శాస్త్రములను గురించి తెలుసుకొందాము.

ఒక విషయమును గురించి చెప్పునపుడు నోటితో చెప్పితే ఆ మాట ఆ సమయములోనే, ఆ ప్రాంతములోనే వినిపించగలదు. అలా కాకుండ చెప్పిన విషయము ఎల్లప్పుడు అన్నిప్రాంతములలో తెలియాలంటే అది గ్రంథరూపము కావాలి. పుస్తకరూపమైన విషయము పుస్తకమున్నంత వరకు ఉండగలదు. అటువంటి పుస్తకములు రెండు రకములు గలవు. అవియే పురాణములు, శాస్త్రములు. జరుగవలసిన కాలములో మానవుడు ఈ విధముగ నడువవలెనని సమాచారమును తెలుపు నిమిత్తము, వ్రాయబడిన పుస్తకములు కల్పితములతో కూడుకొన్నవి కొన్ని కాగ, ఏమాత్రము కల్పితములు లేనివి కొన్ని గలవు. కల్పితములతో కూడుకొన్నవే పురాణములు. మానవున్ని మంచి మార్గములో నడుపవలెనను పురాణములలోనున్న ఉద్దేశ్యము మంచిదే. అయినప్పటికి తెలుపబడిన విషయము కల్పితములతో కూడుకొన్న దానివలన హేతువాదుల విమర్శలకు నిలువలేక పోవుచున్నవి. విమర్శలకు జవాబివ్వగల స్థోమత పురాణములలో లేదు. వాస్తవ జ్ఞానము పురాణములలో లేని దానివలన