పుట:Geetanjali (Telugu).pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గీతాంజలి.

నంసమగుపైడివీణియ ♦ యందు శ్రుతిని
హాయిగా గూర్చినప్పుడు ♦ హర్షమునను
నెదుసన్నిధి నొసగి మ ♦న్నింపుమయ్య!

16


అమలసౌభాగ్య జగదుత్స ♦ వమున కేను
బిలువ్బడితిని బరమసం ♦ ప్రీతితోడ;
ధన్య మయ్యెను నాజీవి ♦ తమ్ము నేడు;
కనులపండువుగా నెల్ల ♦ గంటి గంటి;
విందుగా వీనులకు నెల్ల ♦ వింటి వింటి;
నొప్పగా నాదు వాద్యమీ ♦ యుత్సవమున
నెలమి వాయించుపని నాకు ♦ నీయబడియె;
శక్తివంచనలేక నే ♦ సలుపగంటి;
నెమ్మితో లోపలికి బోయి ♦ నిన్ను జూచి
"నెమ్మదిగ భక్తితో వంద ♦ నమ్ము సలుపు
సమయమా" యని యడిగెద ♦ స్వామి నిపుడు

17


కడకు నాతనికరముల ♦బడగ నెంచి
వేచియున్నడ బూద్యమౌ ♦ ప్రేమకొఱఖూ
నేన్ జేసిన జాగెల్ల ♦ దానికొఱకె