పుట:Geetanjali (Telugu).pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

9

గీతాంజలి.

11

జపతపంబులు గానముల్ ♦ చాలు జాలు;
ననితలుపులు మూసి యీ ♦ యాలయమునం
జిమ్మచీకటిగొందిలో ♦ జెరి యిట్టు
లొంటి నెవ్వరిని బూజించు ♦ చుంటి విపుడు?
తెఱచి కన్నుల జూడుము ♦ దేవు డెదుటం
గానవచ్చునొ లేదొ నీ ♦ కన్నులకును.
గట్టియాభూమి దున్నెడు ♦ కాపువాడు
కూలికై త్రోవ గంకర ♦ గొట్టువాడు
కష్టపడుచోట నాతడు ♦ గలడు; చూడు!
దుమ్ము తనవస్త్రములమీద ♦ గ్రమ్ముచుండ
నెండవానలలో వారి ♦ దండ నుండు;
నతనివలె శుభ్రవస్త్రంబు ♦ నవల బెట్టి
దుమ్ములోనికి నీవును ♦ రమ్ము! రమ్ము.
మోక్షమా? చూడు మద్ది యే ♦ మూల గలదొ
నాధుడునుగూఛ సృష్టిబం ♦ ధమ్మం దాను
బూని యున్నాడు సంతోష ♦ పూర్వకముగ;
విడక మ్నలోన బద్దుడై ♦ వెలసినాడు.
ధూపదీపాదులను బెట్టి ♦దూరమందు
వెలుపలికి రమ్ము ధ్యానంబు ♦ వీది నీవు;