పుట:Ganapati (novel).pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

282

గ ణ ప తి

ములు వానిమీద చెప్పుచున్నారని తల్లిదండ్రు లూహించిరే కాని దాని యాథార్థ్యము జక్కగా నరసి కనుగొన వలయునని వారికి తోఁచలేదు. పంతులుగా రతిక్రూరశిక్ష జేయుచున్నారని బిడ్డలు గోల పెట్టినప్పుడు సయితము తమబిడ్డలను మిక్కిలి గారాబమున బెంచుకొను చున్న వారిద్దఱు ముగ్గురు దక్క దక్కినవారా మొఱ చెవినిడక 'పిల్లవా ళ్ళేదో దుండగము చేయఁబట్టి పంతులు కొట్టుచున్నాడే కాని యూరకకొట్టునా? పిల్లల మాటలు పట్టుకొని పంతులుగారితో వివాదపడుట మంచిదికాదు.' అని యా విషయమై వా రెంతమాత్రము విచారింపరైరి. అభిమన్యుఁడు పద్మవ్యూహమందు బ్రవేశించుటయే గాని దానినుండి వెలికివచ్చుట యెఱు గనట్లు గణపతి శ్రుతపాండిత్య ప్రభావము చేత నేవో కొన్ని లెక్కలు చెప్పుటయె యెఱుఁగును. కాని పిల్లలు లెక్కలు చేసిన తరువాత నవి సరిగ నున్నవో లేదో దిద్దుట యెఱుఁగడు. ఎవరిది తప్పో నిర్ణయింపఁజాలడు. ఉన్న పిల్లలలోఁ బెద్దవాఁడు చేసినదె సరి యని దానింబట్టి తక్కినవారి లెక్కలు నిర్ణయించును. అందుచేత నతని ప్రజ్ఞా సారము బాలకు లెల్లరు గ్రహించిరి. చదువు రాకపోవుటయు, దెబ్బలు ప్రతిదినము వర్షధారలవలె పడుచుండుటయు, సంరక్షకులుఁ దలిదండ్రులు తమ మొఱలు వినకపోవుటయుఁ జూచి బుద్ధి మంతులైన కొందఱు పిల్లలు పంతులుగారికి మెల్లమెల్లగ లంచములు మప్పిరి. తిరుపతి వెంకటేశ్వరులు మొదలగు