పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కార్యమున అమ్మ చేసిన వంట యందు అపూర్వమైన రుచియేకాక, వండిన పదార్థము ఎంతమంది కైనను అక్షయముగా సరిపోవుట ఆశ్చర్యకరముగా నుండెను. మందసాలో రాజ కుటుంబమువారి యభ్యర్థనమున అమ్మ నాయనలు ఇంచుమించుగా ఒక సంవత్సర ముండిరి.

మందసా యందు వారు మూడు సంవత్సరము లుండిరని వాసిష్ఠ వైభవము నందు చెప్పబడినది.

"వత్సరత్రయకాలోఽభవన్మందసాయా మావాసః"*[1]

జగదీశ శాస్త్రి యొక్క సోదరుడు రామనాథ బ్రహ్మచారి (యజ్ఞరామ దీక్షితుడు) తిరువణ్ణామలై నుండి మందసాకు వచ్చి 'హృదయకుహర మధ్యే' అను శ్లోకమును జగదీశశాస్త్రి ఆరంభించి వదలిపెట్టగా రమణ భగవానుడు దానినెట్లు పూరించెనో నాయనకు వివరించి చెప్పెను. ఆ శ్లోకము యొక్క అర్థ గాంభీర్యమునకు నాయన ఆశ్చర్యపడి తన యానందమును ఆ బ్రహ్మచారి ద్వారా గురువునకు నివేదించుకొనెను.

మందసా నుండి కలమూరి వేంకటశాస్త్రి (ఆధాము) అను శిష్యునితో అమ్మతో రెండు నెలలలో కాశి, గయ, ప్రయాగ, అయోధ్య మొదలగు క్షేత్రములకు నాయన యాత్ర గావించెను. అప్పుడు బృందావన మధురలో జరుగు చుండిన పండిత సభలకు పోయి నాయన, బాల్యమునకు కన్యాత్వమునకు భేదము కలదని,

  1. * 195 - ప్రకరణము - 18