పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉమా సహస్రముయొక్క శుద్ధప్రతి లేఖన పఠనములు 1908 జనవరిలో ఆరంభింపబడి మార్చిలో ముగిసెను. అప్పుడు మరకత శ్యామాంబాలయమునుండి మహర్షి విరూపాక్ష గుహకు బయలుదేరుచుండగా వాసిష్ఠుడు ఆయనను సమీపించి "నాకు ఎక్కడికైన యాత్రగా పోయి తపస్సు చేయవలయునని సంకల్పము కలుగుచున్నది; "అహం" మూలాన్వేషణమే నా సంకల్పముల నన్నింటిని సఫలముగ చేయునా? లేక ఏదైన మంత్రధ్యానము అవశ్యకమా?" అని యడిగెను. "మొదటిదే చాలును; అది సకలార్థసాధకము" అని మహర్షి యనెను. "నా సంకల్పము మంచిదేనా?" అని వాసిష్ఠుడు మరల అడిగెను. అందులకు భగవాను డిట్లనెను. "ఈశ్వరునిపై భారము వేయుడు మీ భారములు తొలగును. తన కర్తవ్యము ఆయనకు తెలియును"

రెండవప్రశ్నకు మహర్షి వాసిష్ఠుని సంకల్పము మంచిదనికాని, కాదని కాని నేరుగా సమాధానము చెప్పలేదు. ఈ సందర్భమున కృష్ణభిక్షు మహర్షియభిప్రాయమును సూచించుచు సద్విద్యలోని పద్యమును ఉదాహరించెను.

"ఈ తత్త్వమునే మహర్షులు 'సద్విద్యలో' (ఉన్నది-నలువది)

"భూభార మీశుండు - పూనంగ నట్లె
 యాభాసజీవు డ - య్యది మోయు పూన్కి
 గోపురంబును మోతు - నేపున ననెడి
 తద్వాహిబింబము - దర్పము నిజము"*[1]

  1. * ప. 16 అనుబంధము శ్రీరమణ లీల - పుట. 128