పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యగుటకు గురుని యనుగ్రహమే కారణమని గ్రంథము చివర నాయన ఉల్లేఖించెను.

పిదప మహర్షి ఆదేశమున నాయన కొండ శిఖరమున "సప్తఝరి" అను ప్రదేశమునందు శిరస్సుయొక్క తాపమును శమింపజేసుకొనుటకు వారము రోజులుండి, దూరదృష్టి దూర శ్రవణము మొదలగు సిద్ధులను పొంది తిరిగి వచ్చెను. తరువాత మరకత శ్యామాంబాలయమున మహోత్సవముగా నాయన గ్రంథమును పఠించెను. అప్పుడు ఒకనాడు చిఱుపాకం కొండయ్య అను గణపతి యుపాసకుడు అక్కడికి వచ్చెను. "నీవు గణపతి యుపాసకుడవు గదా!' అని నాయన అతనిని పలుకరించెను. అతడు ఆశ్చర్యము నొంది ఇట్లనెను. "ఔను. నేను గణపతిని ఆరాధించుచు కావించిన యాజ్యహోమమునందు ప్రజ్వరిల్లిన జ్వాలలలో ఒక దివ్యాకృతి కన్పించెను. గణపతియే అట్లు గోచరించెనని తలంచితిని. ఆ యాకృతి గల పురుషుడు ఎక్కడనైన కనిపించునేమో అని వెదకుచుంటిని. ఆ పురుషుడు మీరే" ఇట్లు చెప్పి కొండయ్య నాయనకు పాదాభివందనము గావించెను. దీని వలన గణపతియే నాయనగా అవతరించెనని అందరకును తెలిసెను.

మఱియొకనాడు ఇంకొక సంఘటనము సంభవించెను. వేకువజామున భక్తులందరు శ్రీ రమణ సన్నిధియందు ప్రార్థనకు ఉపక్రమించుచుండగా హఠాత్తుగా రమణుని చుట్టు ఒక జ్యోతి ఆవిర్భవించి ఆయన ఫాలమును ఆరుసార్లు తాకెను. ఆ తేజస్సు