పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/124

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హెచ్చుగా నుండిరి. అక్కడ గుంటూరు లక్ష్మికాంతము తెలుగు పాఠశాలను నడుపుచుండెను. 24-11-1934 తేది నాయన కలకత్తాకు వచ్చినప్పుడు సూర్యనారాయణ యింటిలో వసతిలేక ఆయనను లక్ష్మికాంతముగారి యింటిలో ఉంచిరి. లక్ష్మికాంతము నాయనను చూడగనే పదేండ్లక్రిందట తాను స్వప్నములో చూచిన సిద్ధపురుషునిగా గుర్తించి ఆశ్చర్యమును ఆనందమును పొందెను.

ఆనాడు సూర్యనారాయణతో వచ్చిన మిత్రులు అభిలషింపగా యింటియందే నాయన తన చరిత్రమును గంట సేపు చెప్పెను. ఆ రాత్రి శనివారపు భజనకు సుమారు నలువదిమంది చేరి భజన యైన తరువాత నాయనను ఉపన్యసింపుమనిరి. యజ్ఞావతారము తేజోంశావతారము అని అవతారములు రెండు విధములుగా నుండునని, రామకృష్ణాదులు యజ్ఞావతారములని, మానవుల నిష్కామకర్మ యజ్ఞరూపమై ఈ యవతారములకు ఉపాధి యగునని, జన్మాంతర పుణ్య బలము గలవారు తేజోంశావతారులని, వీరు ఆధ్యాత్మిక ప్రపంచమునకు గురువులు ఆదర్శప్రాయులును అగుదురని నాయన ఆ ప్రసంగమున వివరించెను. ఆదివారం పెద్ద సభలో నాయన వేదకాలమును గూర్చి, సోమవారము రమణ భగవానుని గూర్చి ప్రసంగించెను.

త్వరలోనే అనేకులు నాయనకు శిష్యులు రమణునకు భక్తులు ఏర్పడిరి. తరువాత పాఠశాలయందే ఆయన పదునైదు ఉపన్యాసముల నిచ్చెను. ప్రసంగములు ప్రశ్నలపై ఆధారపడి యుండెడివి. ఆ ప్రశ్నలను కూర్చుటలో ఆ పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడైన