పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/102

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"నాయన పోయినాడని వార్త చేరగానే భగవాన్ 'పోయినాడా' అని గద్గద స్వరముతో కన్నీటితో 'అటువంటి వాడు మన కెక్కడ నుండి వస్తాడు' అనిరి.

ఖర్గపూరు శిష్యులు నాయనకు పాడెమీద నుండగా Photo తీసి Enlarge చేయించి తెచ్చి భగవానునకు చూపుచుండగా నేనును హాలు నందుంటిని.

వణకుచున్న కంఠముతో కన్నీటితో భగవాను వాక్కు: 'నాయన చనిపోయినారని ఎవరన్నారు. గాడసమాధిలో నున్నట్లు వున్నారుగదా' అని మొగము నితరులకు చూపక ఉత్తరపు గోడవైపు త్రిప్పిరి.[1]

"జయంతి తే సుకృతినో రససిద్దా:"

12. శ్రీఅరవింద దర్శనము

నాయన చెన్నపురము నుండి అరుణాచలమునకు మరలి వచ్చిన తరువాత, మహర్షి సంస్కృతమున రచించిన యుపదేశ సారమును చూచి దానియందలి గాంభీర్యమునకు, సౌలభ్యమునకు ఆశ్చర్యమును, ఆనందమును పొంది వెంటనే దానికి లఘువ్యాఖ్యను రచించి గురువునకు సమర్పించెను. అప్పటికి ఆశ్రమములోని పరిస్థితి నాయనకు సుఖకరముగా లేదు. గురువును దర్శించుచు సాయంకాలము లందు కొంతసేపు గడుపుచున్నను నాయన ఆశ్రమ వ్యవహారములలో గాని, భగవానుని ఎదుట జరుగు సల్లాపములలో

  1. * జయంతి సంచిక - 'నాకు తెలిసిన నాయన' కృష్ణభిక్షు - పుట 10