పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అప్పికట్ల కయిఫియ్యతు

118


౧౨౦౦ (AD 1278) మొదలుకొని శాలివాహనం ౧౨౯౯ శకం (AD 1278) వర్కు నూరు సంవ్వత్సరములు ప్రభుత్వము చేసిరి.

తదనంతరం లాంగ్గూల గజపతి రెడ్లను జయించ్చి కటకం మొదలుకొని వుదయగిరి పరియంత్తరం గిరిదుగ౯ములు అన్నీ సాధించి ప్రభుత్వం చేశ్ని మీద అతని వంశీకులైన కపిలేశ్వర గజపతి, విద్యాథర గజపతి, కవి మొదలయ్ని వారు అధికారం చేశ్ని తరువాత పురుషోత్తమ దేవ గజపతి మహారాయలవారి అధికారములో సర్వేపల్లి తిమ్మారెడ్డిగారికి యీ దేశం ప్రభుత్వం యిచ్చిరి గన్కు శాలివాహనం ౧౪౧౮ సంవత్సరము (AD 1496) వరకు దేశం అతని ప్రభుత్వంలో జరిగినది. తదనంత్తరం వీరభద్ర గజపతి రావుగారు శాలివాహనం ౧౪౯౯ శక(AD 1497) మందు పట్టాభిషిక్తుడై శాలివాహనం ౧౪౩౬ (1514 AD) వరకు ౧౮ సంవత్సరమునకు రాజ్యం చేశెను. సదరహీ సంవత్సరములకు తిమ్మారెడ్డి పరంగ్గాగానే అధికారం జర్గినది. తరువాత నరపతి శింహ్వాసనస్థుడైన కృష్ణదేవ మహ రాయలు యీ తూవు౯ దేశములు సాధించ్చి వీరభద్ర రాయుంణ్ని దేశం వశీకృతం నేను కొని సమస్తమయ్ని దివ్యస్థళాలకు అగ్రహరం ఖండ్రి కెలు యిచ్చి శాలివాహనం ౧౪౩౦ (1508 AD) వరకు మొదలుకొని శాలివాహనం ౧౪౫౫ (AD 1533) సంవత్సరం వరకు ౨౫ సంవత్సరములు ప్రభుత్వం జర్గినది. ఆ పిమ్మట సదాశివదేవ మహారాయలు వారు విజయ నగరమంద్దు సింహ్వసనారూఢుడై పృథ్వీవి పాలనశాయగా రామరాజయ్యగారు దండ్డనాయకుడై ప్రవృత్తించగా శాలివాహనం ౧౪౫౩ శకం మొదలుకొని ౧౫२౮ సంవ త్సరం (1556 AD) వర్కు ౨౨ సంవత్సరములు రాజ్యం చేశ్ని మీదట రామరాజయ్యగారు సర్వాధికారులై (AD 1556) ౧౪२౮ శకం (1556 AD) లగాయతు ౧౪౯౪ శకం (1572 AD) వర్కు ౧౪ సంవత్సరములు ప్రభుత్వం చేశినారు.

తదనంత్తరం ౧౪౯౪ శకం (AD 1572) మొదలుకొని స్న....? ఫసలీ వర్కు యీ దేశం తురకాణ్యం ప్రబలమాయను గన్కు జమీందారు దేశముఖు దేశ పాండ్య మజ్ముందారు మొదలయిన బారాముస్సద్దీ హోదాలు నిన౯యించి సర్కారు సముతు బంద్దీలు యేప౯రచి ఆమీళ్ళ పరంగ్గా విభురాం పాదుశాహా వారి అమలు లాగాయతుసుత్తా నబ్ధుల్లా తానీషా ఆలంగిరి పాదుశహా అమలు పరియంత్తరం స్న....? పసలీ లగాయతు హైదరాబాదు నుంచ్చి పౌజుదారు మూలంగ్గా మామ్లియ్యతు జర్గించివారు. నిజామిద్ధ............ పాదుశహావారి అధికారం అయిన తరువాత తింమ్మభూపాల పట్నాన్కి నిజాంపట్నం అని పేరు బెట్టి బస్తీచేశి పెదపల్లి...పెరలి యీ మూడు సముతులు యీ పట్నం కింద్ద చెల్లేటట్టు చేశి నిజాంపట్నం సర్కారు అని త్నఖలీఫా కిందను వుంచ్చుకునే గన్కు వారి తరుపున జమాలు ఖానుడు అనే పౌజుదారుడు యీ సర్కారు మామ్లియ్యతు చేస్తువుండ్డే ద్నిములలో మజ్కూరిలో పూర్వకుశోత్తుంగ్గ చోళరాజు తవ్వించిన పంట్ట చెర్వు కట్ట విస్తరించ్చి కృష్ణ వరద వచ్చి బహు ప్రవాహం చాతను కట్ట నిల్వక గడ్డి కల౯పాలెం కింద దిగయేరు పడి సముద్రణమిని ఆయినంద్ను షాజుదారుడు చెరు కుడరను నీరు వుండ్డే లాగ్ను వశది