పుట:Ecchini-Kumari1919.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

54

ఇచ్చినీకుమారి


లును గాదు.తనయన్నయగు పరమారు నడుగుట తప్ప నామెకు సాధనాంతరము లేదు. మఱియు, నామెయంతనఱకే స్వతంత్రురాలు. కుమారునికోర్కి దీర్చుట కామె యొక నాఁడన్న గారిని జూచి తనయభిలాష మెజిఁగించెను. అందుల కతఁడన్మూ! అదియు నాకును సంతోషమే ! పెండ్లికూతురు చిన్నపిల్ల కాదు. 'పెండ్లి విషయమై యామెమనస్సున నుసరించి మనము నడవవలెను. కాని, యామెను మనయిష్టప్రకారమునడవు మనుట భావ్యము కాదుగదా ! నే నేమి చేయఁగలను? నీవు మాకు క్రొత్త దానవు కావు. ఎట్లయిస, నీవు పోయినీ మేనగోడలి నొప్పించి నీకొడుకునకుఁ జేసికొనుము.యాటంక మేమియును లేదు' అని పలికెను.

లలితా దేవి యతని వచనములు నిష్కపటములసియు,సత్యములనియు నెఱుఁగును. ఆమె వెంట నే యింటికి వచ్చిపరమారుఁడు చెప్పినమాటలు వినిపించి 'కుమారా ! నీకోర్కెనెర వేఱుట యసాధ్యము. ఇచ్ఛినికి బృథ్వీ రాజునందున్నయనురాగ మనివార్యమైనది. దానిని ద్రిప్పుట యీశ్వరునకుఁ గూడ నలవి కాదు. చిన్న నాఁటి ప్రేమనుబట్టి యామె నిన్నువరించునని యనుకొనుచున్నావు. అది పొరపాటు. చిన్నప్పటి గుణములును, చేష్టలును, భావములును యవనమంకురించిన తోడ నే మాఱిపోవును. ప్రేమకూడ నానావిధములు. - చిన్న నాటి ప్రేమ వేఱు; భూవన కాలమున నావిర్భవించునది వేఱు.ఇక నీ వాప్రయత్నము విడిచి వేఱొక తెను వరించి సుఖం