పుట:Ecchini-Kumari1919.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36

ఇచ్చినీ కు మారి


ర్యము ! అగ్ని హోత్రము చల్లనియమృతబిందువులను గురియు చున్నదే ! దారుణమగు పిరంగి కోమలములగు పుష్పగుచ్ఛ ముల వెదచల్లుచున్నదే ! క్రూర హృదయమగు పెద్దపులి సాధు త్వమును వెల్లడించుచున్నదే ! 'మంచిది, కానిమ్ము! చెప్ప వలసినది చెప్పుము' అని పల్కెను.

ఇంతకుఁబూర్వము భీమ దేవుఁడు జై తపరచమునకు గర్భశత్రువై పక్కలోనిబల్లెమై, పరమారుని పేరు విన్న తోడనే బగ్గునమండిపడుచుండెడివాఁడు. అట్టివాఁ డిపు డిట్టి మృదుమధుర వచనములు పలుకుచున్నందులకుఁ బరమారుఁ డాశ్చర్యపడి యిట్లు పలికెను.

అమర సింహుఁడు మరలఁ దన ప్రసంగ మారంభిం చెను. ‘భూపాలా ! అత్యుత్తముఁడవగు నీతో జుట్టఱకము చేసికొన మనస్సువ్విళ్ళూరుచున్నది. నీకుమారికను (ఇచ్చి నీకుమారిని) సంతోషముతో ఘూర్జర రాజ్యలక్ష్మికి సపత్ని గాఁ జేయుదువు గాక ! నీపుత్రిక తన సౌందర్యవిలాసములచే నీ భీము దేవునంతః పురము నలంకరించుఁగాక ! ' అని పల్కుచుండఁ బరమారుఁ డడ్డుపడి యిట్లనియె.

తెలిసెఁ దెలిసె ! ఈమంచిమాటలు, ఈస్తోత్రములు 'నిందులకా ? 'ఓయీ ! మీ రాజుకోర్కె యెప్పటికిని నేఱ వేఱదు. పరమపవిత్రమగు హిందూమతమును విడిచి జైన మతావలంబియగు నతనికి నాకూఁతు నిచ్చెద నన్న మాట వట్టిది. అట్లోనర్చి నిర్మలమగు నా వంశమును నకళంక ముగా