పుట:Ecchini-Kumari1919.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము 30

179


వృత్తాంతమంతయు సత్యమే యని తలంచిరి. ఆ సాయంసమ యమున నేను రహస్యముగా నిచ్ఛినీకుమారి చెంతకుఁ బోయి యావృత్తాంతమును విన్నవింప నామే చెలిక తైయగు వకు ళను భూయాదుని చెంతకుఁ బుచ్చి మాయ చే వాని నచ్చటకు రప్పించి యొక గదిలోఁ బెట్టి తలుపు వేసి పురుష వేషముతో నాచెంతకు వచ్చెను.రూపవతియు, ద్వార పాలకులును నా రాజ కుమారిని భూయాదుఁడనియే నమ్మియుండిరి, నే మందుండి తప్పించుకొనివచ్చుట యేగాక మాక పకారిణి యగురూపవతికిఁ దగిన ప్రాయశ్చిత్తముఁ గావించితిమి. మరియు నా రాజ కుమారి చాళుక్యులు మాయోపాయముచే మిమ్ముఁ జంప నున్నట్లు నావలన విని యాయపాయ మెట్లయినను దప్పించి మిమ్ము రక్షింపవలె నని నిశ్చయించి పలుపాట్లు పడి కరుణ రాజు సాయమునఁ దనయభిలాషను నెఱ వేర్చుకొన్నది. దుర్మార్గుఁడగు 'సమర సింహుని జంపి తనకసి దీర్చుకొన్నది.” అని యామెను వర్ణించుచుండఁ బృథ్వీరా జతనిఁ జూచి “చాళుక్యులు నన్ను జంపనున్నట్లు నీ కెట్లు దెలిసె' నని ప్రశ్నించెను.

అది విని యీశ్వర భట్టు 'మహా రాజా! అమరసిం హుఁడు భీమున కుత్తర మొకటి పంపుచు నందు నేను ఢిల్లీకిఁ బోయి రెండవ పని నెఱ నేర్చుకొని వత్తు' నని వ్రాసెను. . ఆయుత్తరము నాచేతఁ బడినది. “దానివలన జాళుక్యులు పృథ్వీ రాజునకు ద్రోహము తలంచు చుందురని నే ననుమాన పడి రహస్యముగా వారిచర్యల • నరయు చుంటిని. అమర సింహునకును, వారికిని రహస్యముగా నుత్తరప్రత్యుత్తర ములు జరుగుచున్నట్లు తెలియవ చ్చెను. అమరసింహు