పుట:DivyaDesaPrakasika.djvu/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

   ఇన్దిరవోడు పిరమన్ ఈశన్ ఇమయవ రెల్లామ్‌
   మన్దిర మామలర్ కొణ్డు మఱైన్దువరాయ్ వన్దు నిన్ఱార్‌
   శన్దిరన్ మాళిగై శేరుం శదురరగళ్ వెళ్లఱై నిన్ఱాయ్‌
   అన్దియ మ్చోదిదువాగుమ్‌ అழగనే ! కాప్పిడ వారాయ్.
          పెరియాళ్వార్-పెరియాళ్వార్ తిరుమొழி 2-8-1

7. తిరుప్పుళ్ళం పూతంగుడి

(కుంభఘోణము 10 కి.మీ)

శ్లో. శ్రీ గృధ్రాభిధ తీర్థ సుందర తటే భోగేశయ ప్రాజ్మఖ:
   పుళ్లంపూద పురే తు శోభసపదం వైమాన మభ్యాగత: |
   శ్రీమాన్ వల్విలిరామ నామక విభు: పొత్తామరాఖ్య ప్రియ:
   గృధ్రేంద్రాక్షి పదం కలిఘ్న వచసాం పాత్రం తు రారాజతే:

వివరణ: వల్ విల్లి రాములు-పొత్తామరైయాళ్ తాయార్-శోభన విమానం గృధ్ర తీర్థము-తూర్పు ముఖము-భుజంగ శయనము-జటాయువునకు ప్రత్యక్షము. తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశేషములు: శ్రీరామచంద్రులు జటాయువునకు ప్రత్యక్షమై మోక్షము నిచ్చిన స్థలము. ఈక్షేత్ర స్వామి విషయమై శ్రీ వేదాంత దేశికులు "పరమార్థ స్తుతి" అను స్తోత్రమును అనుగ్రహించిరి. తొండరడిప్పొడి యాళ్వార్ల అవతారస్థలమైన "మణ్ణబ్గుడి" ఈ దివ్యదేశమునకు అతి సమీపములో గలదు. 1 కి.మీ దూరములో తిరువాదనూర్ దివ్య దేశము కలదు.

మార్గము: కుంభకోణం-స్వామిమలై-తిరువైకావూర్ టౌను బస్ మార్గములో స్వామిమలైనుండి 5 కి.మీ దూరములో నున్నది. ఈ సన్నిధి అహోబిల మఠంవారి నిర్వాహములో నున్నది. మఠములో తగిన వసతులు గలవు.

   అఱివదయాన న్తె త్తులగుముడై యానెనై యాళుడై యాన్‌
   కుఱియ మాణురువాగియ కూత్తన్ మన్నియమరుమిడమ్;
   నఱియ మలర్‌మేల్ శురుమ్చార్క వెழிలార్ మఇజై నడమాడ
   పొఱిగొళ్ శిఱై వణ్డిశై పాడుమ్‌ పుళ్లమ్‌బూదబ్గుడిదానే
          తిరుమంగై ఆళ్వార్ పెరియ తిరుమొழி 5-1-1