పుట:DivyaDesaPrakasika.djvu/297

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కులశేఖరాళ్వార్లు

తిరునక్షత్రతనియన్:-
   కుంభే పునర్వసౌ జాతాం కేరళే చోళ పట్టణే
   కౌస్తుభాంశం ధరాధీశం కులశేఖర మాశ్రయే||
నిత్యతనియన్:-
   ఘుష్యతే యస్య నగరే రంగయాత్రా దినే దినే
   తమహం శిరసా వందే రాజాసం కులశేఖరమ్‌||

వీరు చేరదేశమున(కేరళ)తిరువంజిక్కళం (కోழி) యను దివ్యదేశమున క్షత్రియ వర్ణమున కలియుగాది ఇరువది యెనిమిదవ సంవత్సరమగు పరాభవనామ సంవత్సర కుంభ(మాఘ) మాసము శుద్ద ఏకాదశి గురువారము పునర్వసు నక్షత్రమున కౌస్తుభాంశమున అవతరించిరి.

వీరు "కూరార్‌న్ద వేల్ వలవన్ కోழிయర్‌కోన్ కుడైక్కులశేఖరన్" (వాడియైన వేల్ అను ఆయుధ ప్రయోగమున దక్షులును, కోழி నగర ప్రభువులును, చత్రధారులును అగు కులశేఖరాళ్వర్లు) అనునట్లు క్షత్రియోచితముగ రాజ్యపాలన చేసెడివారు.

పిమ్మట సర్వేశ్వరుని నిర్హేతుక జాయమాన కటాక్షలబ్ధి దివ్యజ్ఞాన సంపన్నులై "ఇన్బమరుమ్‌ శెల్వముమ్‌ ఇవ్వరశుమ్‌ యాన్ వేణ్డేన్" (భోగ సమృద్ధమైన యీ సంపద, రాజ్యము నాకు వలదని విరక్తులై శ్రీరంగనాథులను సేవింపవలెనను ఆశచే ప్రతినిత్యము శ్రీరంగయాత్రా ప్రయత్నము చేయుచుండెడివారు.

వీరికి శ్రీరామచంద్రుల యందు ప్రేమాతిశయమధికము. ఒక పర్యాయము వీరు శ్రీరామాయణ కాలక్షేపమున "జన స్థానమునగల పదునాల్గు వేల రాక్షస పరివార సహితులగు ఖరదూషణ త్రిశిరులను శ్రీరామచంద్రడెదుర్కొనె" నను ఘట్టమునువిని తన్మయులై సర్వేశ్వరుని యందుగల ప్రేమాతిశయమున శ్రీరామచంద్రులకు సహాయపడుటకై పరివార సమేతముగా బయల్వెడలిరి. ఇదిగాంచిన మంత్రులు పౌరాణికులచే శ్రీరామచంద్రుల విజయమును వినిపింపగా సంతృప్తులై వెనుదిరిగిరి.

శ్రీవైష్ణవ సంప్రదాయమున శ్రీరమచంద్రునకు "పెరుమాళ్" అని తిరునామము. వారియందు అత్యంత ప్రీతి కలిగి వారి నక్షత్రము నందవతరించిన ఈ ఆళ్వార్లకును పెరుమాళ్ అనుతిరునామ మేర్పడినది. వీరనుగ్రహించిన దివ్య ప్రబంధము

                                    191