పుట:DivyaDesaPrakasika.djvu/211

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆళ్వార్ల కీర్తనలలో తిరుమల

తొలుత దేశబాషయైన తమిళభాషలో తిరుమలేశుని కీర్తించి ఆతని మహిమను లోకమున చాటిచెప్పినవారు ఆళ్వార్లు. "వడతిరు వేజ్గడమ్‌; తిరుమలై" అని వారు ఈ పర్వతరాజమును కీర్తించారు. ఇచటి స్వామిని "తిరువేంగడత్తాన్; తిరువేంగడముడైయాన్; అలర్‌మేల్ మంగై యుఱై మార్పన్"అని ప్రస్తుతించారు.

భగవన్తుడు వేంచేసియుండు దివ్యదేశముల కన్నింటికి "తిరుప్పది" అనియే పేరు "పది" అనగా స్థానము అని అర్దము. 108 తిరుప్పదులు ఆళ్వార్లచే కీర్తింపబడినవి. అవి అన్నియు తిరుప్పదులే. కానీ కాలక్రమంలో "తిరుప్పది" అనుపేరు. ఈక్షేత్రమునకు మాత్రమే వాచకంగా రూడమైనది. "తిరుప్పది"యే తిరుపతిగా మారినది. "తిరుమాల్ అనగా శ్రియ:పతి. ఆయనకు నిత్యనివాసస్థానమైన తిరుమలై తమిళదేశానికి ఆనాటి ఉత్తర సరిహద్దుగా "తొల్‌కాప్పియం" అను ప్రాచీన తమిళ గ్రంథమున పేర్కొనబడినది.

ప్రపన్నజన కూటస్థులైన నమ్మాళ్వార్లు ఈశ్రీనివాసుని పాదారవిందముల యందే "అలర్‌మేల్ మంగై యుఱైమార్పా....పుగలొ న్ఱిల్లా నడియేన్ ఉన్నడి క్కీழ் అమర్‌న్దు పుకున్దేనే" అంటూ పిరాట్టిని(లక్ష్మీదేవిని) పురుషాకారంగా చేసికొని శరణాగతి చేసినారు. మఱియు "అలర్‌మేల్ మంగై యుఱైమార్పా" అని ప్రస్తుతించి లక్ష్మీ పతిత్వమును ప్రకటించినారు.

మరియు "ఒழிవిల్ కాలమెల్లామ్‌" అను దశకమున సర్వదేశ సర్వకాల సర్వావస్థలయందును ఈస్వామి తిరువడి ఘుళ్ళలో (శ్రీపాదములయందు) కైంకర్యము చేయుటచే పరమ పురుషార్థమని ప్రవచించినారు. అంతేకాక ఈ దశకములోనే "ఎజ్గళ్‌పాశంవైత్త" అను చోట స్వామియొక్క వాత్సల్యగుణమును ప్రకాశింపచేసినారు.

శ్రీగోదాదేవి తమ నాచ్చియార్ తిరుమొழிలో "విణ్ణీలమేలాప్పు" అను దశకమున ఈస్వామివార్కి మేఘములద్వారా తమ సందేశాన్ని వినిపిస్తారు. ఇట్లే ప్రధమ దశకములో "వేంగడవఱ్కెన్నై విదిక్కిత్తియే" అంటూ "మన్మథా! నన్ను వేజ్కటాచలపతితో కలసపూ" అని ప్రాదేయ పడతారు.

ఈస్వామిమ్రోల "వడియాయ్ కిడన్దు ఉన్ పవళవాయ్ కాణ్బేనే" కడపరాయిగా పడియుండి స్వామి దివ్యాధరమును సర్వదా సేవించు చుందును గాక! అని శ్రీకులశేఖరాళ్వార్లు తమ పెరుమాళ్ తిరుమొழிలోని ఊనేఱశెల్వత్తు అను దశకములో ప్రార్థిస్తారు. కావుననే ఇచట గర్భ గృహద్వారమున గల గడపకు "కులశేఖరపడి" అని పేరు.

                                            119