మూఁడన మైసూరు యుద్ధము.
127
చినచోఁ దప్పక తన్నుఁగూడ మ్రింగి వేయ నుంకించునను సంశ
యమితనికిఁ బుట్టెను. వాఁడువిజయుఁ డగుటయు సందేహాస్పద
ముగ నుండెను.ఇంతియేగాక లార్డు కారన్ వాలీ సితనిని బహువిధ
ముల రమ్మని చీరి టిప్పూనోడించుటవలనఁ గలుగులాభములలో
మంచి భాగమిత్తునని వాగ్దానము సేయుచుండెను. కావున నేవిధ
మునఁ జూచినను నాంగ్లేయులతో నేకమయి టిప్పూ నెదురించు
టయె యితనికి లాభ కారిగఁ గాంపించెను. "పేష్వాయును వీరితో
జేర నియ్యకొనెను. కావున నీ మూఁడు కక్షుల వారికిని 1790 వ
సువత్సరమున సంధిజి ఱగెను. దీనివలన నీమూఁడు కక్షులవా
రును టిప్పూసుల్తానుతో విగ్రహము పట్టుదలతో నడుప
నియ్యకొనిరి. అతనితోడి సంబంథములు దామెల్లరును గలిసియే
చేసికొన నెప్పుకొనిరి. జయము గలిగినచో దానివలన నగు
లాభములను సమభాగములుగ బుచ్చుకొన నియమించుకొని..
ఈసంథికిఁ దరువాత దీనిని నడుపుటకోఱకే నైజామునకును
నాంగ్లేయులకును మఱియొక యొడంబడిక నడిచెను. నైజాము
గారి సాహాయ్యర్థము బంగాళమునుండి గనర్న రుజనరలుగారు
నాలుగు మొదలు ఆరుపటాలముల వఱకును బంప నొప్పుకొనిరి.
ఈదండునకగు వ్యయమంతయు నైజాము అచ్చుకోవలసిన దే
గాని నగదుగా నియ్య వలసిన పని లేదు. విగ్రహము ముగిసిన
మీఁదట టిప్పూనుండి తీసికొనఁబడు సొమ్ములో నైజాము
భాగమునుండి అప్పటివరకగు మొత్తమాంగ్లేయులు దీసికొన .