పుట:CNR Satakam PDF File.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

20. ఆ|| పిన్నవారినైన పెద్దలనైనను
ఆదరించునట్టి అమృత హృదయ
నీదు మనసువెన్ననిండిన కుండయే
అనుచు చెప్ప నిజము వినుసినారె!

21. తే|| రాజ్యసభలోన మెంబరై రాజసముగ
తెలుగువాణిని వినిపించి వెలుగుజల్లి
కవులపంక్తి లోపల మొనగాడవగుచు
వెలిగి యశమును బొందితే వినుసినారె!

22. ఆ|| నీవు గూర్చినట్టి నిధుల కారణమున
ఘనత కెక్కురీతి కడపలోన
స్థిరముగాగవలసె సి.పి.బ్రౌను పేరుతో
గ్రంథనిలయ మొకటి ఘనసినారె!

23. తే|| ఆంధ్ర సారస్వత పరిషత్‌ అతులగతిని
జవము జీవము పొందంగ జగతిలోన
పార్లమెంటు నిధులు గూర్చి ప్రథిత రీతి
భవనములు గట్ట జేసితే భళి ! సినారె!

24. తే|| పుస్తకాలకు పురుడులు పోసి పోసి
సభల నావిష్కరించుచు చక్కనైన
హస్తవాసినీదని ఖ్యాతినందినావు
మాన్యచరితుడ వీవయ్య మహిసినారె!