పుట:CNR Satakam PDF File.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10. తే|| తెలుగు అధికార భాషకు తేజమొసగ
పట్టినాడవు అధ్యక్షపదవి నీవు
సకల 'కార్యాలయ పదాళి' సరి నమూన
ఉత్తరమ్ములు గూర్చితే ఉరుసినారె!

11. తే|| వినుతిగన్న అంబేద్కరు ఘనత చాట
విశ్వవిద్యాలయ మొకటి వెలయగాను
దాని కులపతి పదవియు దక్కె నీకు
విదితమైన ప్రతిభ నీది వినుసినారె!

12. తే|| ముఖ్యమంత్రి 'యన్టీయారు' పుణ్యమతిని
తెలుగు సంస్కృతితేజమ్ము తెలుపదలచి
తెలుగు విశ్వవిద్యాలయ దీప్తి నిలుప
కులపతి పదవి పొందితే గురుసినారె!

13. ఆ|| శిష్టకావ్యజాల సృజనంపు శేముషి
సహృదయ యుతమైన సద్విమర్శ
నీదు 'తెలివికత్తి' నెటుజూడ పదునయ్యె
తెలివి యనగ నీదె ధీసినారె!

14. ఆ|| నీ విమర్శశక్తి నింపి కవితలందు
రచన చేసినావు రమ్యగతిని
కావ్యసృష్టి కీవు ఘనభాగమిచ్చుచు
గణుతి కక్కినావు ఘనసినారె!