పుట:Bobbili yuddam natakam.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రవేశకము

21

భోంచేసిం తర్వాత జుట్టు మెలేస్తే, గంగాళం ధ్రప్పళం వస్తుంది. వొంటి చమట తుడిస్తే, మణుగు నెయ్యి అవుఛుంది. పెదవి పిడిస్తే, బ్రిందెడు ప్రాయసం; నెత్తిమీద గ్రుద్దితే, రెండుముక్కులలోనుంచీ, దడదడ బూరెలు రాల్తాయి. క్షామదేవతలారా ! మీ దేం తిండిరా మా అన్న ముందర?

సుబ్బన్న. - ఒరే! ఆపంక్తిలో వాళ్లకిందిప్రీట లన్నీ ప్రగిలినవి ఎరుగుదువా? ప్రీటలు ప్రగులుఛూవుంఛే, వెదురు నేసినఇల్లంచుకుంఛే, బొంగులకణుపులు కాలి ప్రగులఛూవుంఛే, ప్రటప్రటా, ప్రటప్రటా, అని యలాగ్గా అగాదో, అలాగ్గే అయిందిరా, చవులు గింగుర మని పోయినాయిరా?

రామయ్య. - మఱి అందుకే రెండువందలమంది వడ్రంగులు ఆపెద్ధ పెద్ధ అవధాన్ల గార్లకోసరం పీటలు మరమ్మత్తు చేస్తూ వున్నారు.

సుబ్బన్న. - అది సరే గాని, ఆ శతబూరె సహస్రబూరె గాళ్ల పందిట్లో రెండువందలమందిని విస్తళ్లకాణ్ణుంచీ ఝడ్డీపట్టి మోసుకొవెళ్లి చేతులు గడిగినారు, చూశావుషరా?

సోమన్న. - ఔనురా, కోటలో రాయనింగార్లకు పెళ్లిళ్లు. మనకి యిక్కడ నేతివరదమూలంగా విస్తళ్లన్నీ యేకమై, ఒంటే బువ్వంబంతి అయిందిరా. పెద్ధపెద్ధ శాస్త్రుర్లవార్లంతా, తప్పులేదు తినమన్నారు. మేం, యెంగిలిమంగలంగా భోంచేశాం. వొకచేత్తో విస్తళ్లు కొట్టుకొపోకుండా పట్టుకొని, వొకచేత్తో భోంచేశాం. అందరం యవరి విస్తట్లో వాళ్లమే భోంచేశా మని చెప్పలేము.

[అందఱు ఆశ్చర్యపడుచునేపథ్యద్వారమువైపు చూతురు.

[అంతట ఒకబ్రాహ్మణుఁడు పొర్లుచు ప్రవేశించును.]

పొర్లు బ్రా. - [రోఁజుచుమూలుగుచు] హమ్మా ! హమ్మా !

ఇతరులు. - యేమయ్యా, దొర్లుఛావు? యేడుస్చావు?

పొర్లు బ్రా. - [రోఁజుచు] ఖ ఖ ఖడుపునొప్పి !

సుబ్బన్న. - అయ్యా, నాదగ్గిర కడుపునొప్పికి మందు వుంది. యిందా, వొక మాత్ర మింగు, మింగు, త్వరగా మింగు. [అని ఒకమాత్ర తీసి యిచ్చును.

పొర్లు బ్రా. - మా-మా-మా-త్రకి స-స-సం-దుంఛే, మఱి రెండుభూ-భూ-భూ-రెలు తిననుషయ్యా