పుట:Bobbili yuddam natakam.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2

బొబ్బిలియుద్ధనాటకము.

పారి. - [మొగము చిట్లించుకొనుచు] తాండ్ర పాపయ్యవేసాన వొచ్చి 33 పోట్లు లెక్కపెట్టి పొడిచి చంపడానికా?

వ్సూత్ర. - [పారిపార్శ్వికునిం బోనీక పట్టుకొని] కాదురా మూర్ఖా. మనకు కీర్తివలయునేని దానినే ఆడవలయును. ఏల యన?

               ఆ. తప్పు లెల్ల నడఁచి యొప్పులు గురియించు
                    రంగారావుకీర్తి రంగమందుఁ,
                    బాప మడఁచి యిష్టఫలము లానఁగఁ జేయు
                    పారిజాత పాదపంబు కరణి. ౧

పారి. - నా కక్కరలేదయ్యా. (స్వగతము) ఇందులో యే వేసం వొచ్చినా నాకు మధ్యలో డింకకొట్టేదిగానే వొస్తుంది.

[అని తటాలున విడిపించుకొని నిష్క్రమించును.]

సూత్ర. - ఔరా, ఎంతమూర్ఖుఁడు ! [కోపముగా నేపథ్యమువైపు చూచి] ఆర్యా, ఇటు రమ్ము; నీవు పూనుకోక ఈపనిగాదు.

నటి [ప్రవేశించి] - కోప మెందులకు ఆర్యపుత్రా?

సూత్ర. - నీతమ్ముడు ఇపుడు అమాంతముగా నాపుట్టి ముంచినాఁడు. ఈయార్యమిత్రులమ్రోల బొబ్బిలియుద్ధమునాడి మనవైరులకు చెంపపెట్లు వేయింపవలసియుండగా వేసమువేయక పరారి యైనాఁడు!

నటి. - వానితో నేమి ఆర్యపుత్రా? మీతమ్ములు లేరా; నేను లేనా? కోపము మాని ప్రకృత మానతిమ్ము. మన మాడవలసిన బొబ్బిలినాటకము ఎవరు కావించినది?

సూత్ర. - శ్రీమద్వేంకటగిరి సింహపీఠాధిష్ఠాతృ శ్రీ శ్రీరాజగోపాలకృష్ణయాచేంద్రమహారాజ నిరంతర బహూకృత శ్రీమద్వేదాన్వవాయ వేంకటరాయ శాస్త్రి గారు కావించినట్టిది.

నటి. - అదే?

సూత్ర. - అదే.

నటి. - బలే ! బలారే ! అది మనపాలిటి కల్పవృక్షము గదా ! మఱి నే నరిగి పాత్ర వర్గమును సిద్ధపఱిచెదను. [అని పోనుంకించును.

సూత్ర. - పోకుము. ఈయార్యమిశ్రులు నీశరద్గీతమును వినుటకుంజెవులూరు చుం గనుపెట్టుకొని యున్నారు.