పుట:Bobbili yuddam natakam.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నవమాంకము. 99

పాపయ్య. - [ఆశ్చర్యముతో] ఓరీ నీచుఁడా ! ఈ టక్కు ఎక్కడ నేర్చితివి రా! మా రంగారాయని బారిం బడిన యా విజయరాముని భటుల కడ నేర్చితివా?

బుస్సీ. - రాయనింగారూ, శర ణన్న తర్వాత కొట్టుట మీ వెలమనీతులలో లేదే. కావుఁడు దీనుని.

పాపయ్య. - బుస్సీదొరా, నీవు మిక్కిలి దొడ్డవాఁడవు మా చినవేంకటరాయనిం గాచినవాఁడవు ; వీనిచే మోసపోయితివి. నీవు తురుపు ఇచ్చిపంపగా వేంకటలక్ష్మి సామర్లకోటకుఁ బోవుచు మాలపల్లి కడనుండి మాకు సకలవృత్తాంతములను బారికవాని ముఖమునం జెప్పి బంపినది. సలాము నీకు. నీమాటచే వీనిని నాగూరి మీరాసాహెబు టెక్కమునకు బలాదూరుగా విడిచి పెట్టితిని. [అని మెడ విడిచి పాఱవైచును.]

హైదరు. - [స్వగతము] బతికినాను రా బాబూ !

[అని మెడ తడవుకొనుచు, నిట్టూర్పులు నిగుడ్చుచు, పడియే యుండును.]

పాపయ్య. - బుస్సీదొరా, చూచితివా మాబొబ్బిలి వెలమల బీరమును?

బుస్సీ. - చూచితిని, అనుభవించితిని, మెచ్చితిని.

పాపయ్య. - విజయరాముఁడు పంద యని కనుఁగొంటివా ?

బుస్సీ. - నూఱు మార్లు.

పాపయ్య. - ఇఁక నా కిక్కడ పని లేదు. నేను త్వరగాపోయి రంగారావును నా కేల కబురు పంపలేదో అడుగవలయును.

బుస్సీ. - ఆయన పంపినాఁడు. జాబులం దెచ్చు హర్కారులను, రాజుపట్టించి నాఁడు. వారు పోరి చచ్చినంతట ఆజాబులం గైకొన్నాఁడు.

పాపయ్య. - కబు రందియు నేను రాలే దని రంగారాయఁడు నామీఁద కోపగించుచుండును. నేనుపోయి యీసమాధానమును చెప్పుకోవలయును.

బుస్సీ. - బాలుని తక్తు ఎక్కించి నీవు మంత్రివిగా జమీ నేలించుచుండవలయు నని నాప్రార్థన.

పాపయ్య. - ఆపని నీలాద్రిరాయఁడు కావించును. నేనునాకు ప్రేత పిండము వైచుకొంటిని ; ఇఁక నీలోకమున నుండఁజనదు. నేను పోయి విజయరామునికడనే పరమపదించెద. మీదం డ్లన్నియు వచ్చి చూచు నపుడు, రాజుం జీల్చిన పులి యిది యని తెలియవలదా ? [అని తటాలున నిష్క్రమించును.]

బుస్సీ. - హైదర్సాబ్, రాజవధచిత్రమును చూచి వత్తము రా.

హైదరు. - మీరుపోయి సూడండి, కడుపునిండా సూస్కొని రండి, నేను