పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రం 3] బిల్వమంగళ 119

నొసగడమున కీ వేశ్యయూ ఆ లంపటుడున్నూ నిమిత్తమాత్రులు, వీరిద్దరి కృపచేత మనకు నేడు శ్రీకృష్ణుని దర్శన యోగము కలుగు తుంది.

శిష్యు - గురుదేవా ? నే నజ్ఞానుడను - మీ రిప్పుడు చెప్పిన వేశ్యకూ, ఆ లంపటునికీ కోటి ప్రణామములు. శ్రీ కృష్ణుని దర్శనమునకు ఫలమేది?

సోమ - వత్సా ! శ్రీ కృష్ణదర్శనమునకు శ్రీ కృష్ణ దర్శనమే ఫలము. దానికన్న నెక్కువఫల మేమున్నది?

చింతా - అమ్మయ్య!

                      కష్టములు గట్టెక్కె ♦ నిష్టములు ఫలియించె
                                సన్యాసివర నీదు ♦ సందర్శనమున.
                      చల్లనాయెను కళ్లు ♦ శాంతించె మానసము
                                నాదెసజూచి విను ♦ నాదు విన్నపము.
                      చరణదాసిని నీదు ♦ దరి జేర్పగారాదె?
                                సదయ హృదయుడ వీవు ♦ స్పర్ధ నీకేల?
                      నీకు తగునా యింత ♦ నిష్ఠురము నా దెస?
                                ఓ దయాంబుధి చేర్చు ♦ నీదు నాశ్రయము ?
                      చందమామ వెంట ♦ చంద్రిక బోవనౌ,
                                మేఘమాల వెంట-మించు బోవు.
                      కృపజూప వేని నే ♦ నిపుడె త్యజింతును
                                ప్రాణముల నీమెడ ♦ పాతకము జుట్టు.