పుట:Bibllo Streelu new cropped.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

51. రక్తస్రావ రోగి -మార్కు525-34

రక్తస్రావరోగికథ మూడు సమాంతర సువిశేషాల్లోను వస్తుంది. యూదుల సంప్రదాయం ప్రకారం ఈ వ్యాధి సోకిన స్త్రీలు అశుద్దురాళ్లు వాళ్లు ఇతరులను ముట్టుకోగూడదు, సమాజంలోకి రాకూడదు. వాళ్లు తాకిన వస్తువులన్నీ మైలపడతాయి -లేవి 15, 19-24. ఈ రోగులు జనానికి ఎదురుగా కూడ రాకూడదు. అందుకే ఇక్కడ ఆమెవెనుక వైపు నుండి వచ్చి క్రీస్తు అంగీని తాకింది.

ఆమె పండ్రెండేండ్ల నుండి ఈ వ్యాధితో బాధపడుతుంది. ఎందరో వైద్యులవద్ద చికిత్స పొందింది. తనకున్న సొమ్మంతా వెచ్చించింది. ఐనా రోగం ముదిరిందే కాని నయం కాలేదు. పైగా అది దీర్ఘవ్యాధి සටයි. కనుక ఆమె కష్టస్థితిలో వుంది. నిరాశకూ తీవ్రవ్యధకూ గురైంది. అలాంటి పరిస్థితిలో ప్రభువు ఆమెకు ఆరోగ్యదానం చేశాడు. అతడు జనన మరణాలపై, ఆరోగ్య అనారోగ్యలాపై అధికారం కలవాడు.

ఈ రోగి కథ ఈమె ప్రగాఢ విశ్వాసిన్న తెలియజేస్తుంది. அ3) నరమాత్రులు ఇక తన రోగాన్ని నయం జేయలేరని భావించింది. నజరేతూరి యేసునీ అతని అద్భుతాలనూ గూర్చి విని ఆ ప్రభువైనా తన వ్యాధిని కుదురుస్తాడేమోనని తలంచింది. అతని శక్తిని నమ్మింది. ఆ నమ్మకంతోనే క్రీస్తుని సమీపించింది.

యూదుల భావాల ప్రకారం ఆమె అశుద్ధురాలు. కనుక తాను క్రీస్తుని ముట్టుకోగూడదు. ఐనా పర్వాలేదు, కనీసం అతని అంగీని తాకినా తనకు ఆరోగ్యం కలుగుతుంది అనుకొంది. మహానుభావుల దివ్యశక్తి వాళ్ల వస్తాల్లోను వాళ్లవాడే ఇతర వస్తువుల్లోను కూడ వుంటుందని పూర్వులు నమ్మేవాళ్లు. ఈ నమ్మకంతోనే ఆమె వెనుకనుండి వచ్చి క్రీస్తు అంగీని ముట్టుకొంది. (లూకా 8,44 ప్రకారం అంగీఅంచును మాత్రమే ముట్టుకొంది) ప్రభువుకి ఆమె హృదయంలోని విశ్వాసం తెలుసు. కనుక అతడు తత్క్షణమే ఆమెను బహూకరించాడు. ఆమె రోగాన్ని వెంటనే కుదిర్చాడు.