పుట:Bibllo Streelu new cropped.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వొడిలో అమ్మమ్మ వొడిలో కూర్చుండి తిమొతి చిన్ననాడే ధర్మశాస్త్ర వాక్యాలను కంఠతః నేర్చుకొని వుండాలి. పెద్దయ్యాక మళ్లీ తల్లీ అమ్మమ్మలే అతనికి క్రీస్తు మార్గాన్ని కూడ తెలియజేసి వుండాలి. ఆరీతిగా క్రీస్తుని గూర్చిన నికమైన విశ్వాసం ఆ పడతుల నుండి వారిబిడ్డడికి గూడ సంక్రమించి పండాలి. తిమొతి అనే పేరుకి దైవభక్తి కలవాడు, దైవభీతి కలవాడు, దేవుణ్ణి స్తుతించేవాడు అనే అర్ధాలున్నాయి. అతడు తన జీవితంలో ఈ యర్ధాలన్నిటినీ సార్ధకం జేసికొన్నాడు. దీనికి చాల వరకు కారణం అతని తల్లీ అమ్మమ్మలే.

చిన్న బిడ్డలకు మొదట విద్య, విశ్వాసం నేర్పేది తల్లిదండ్రులే. విశేషంగా తల్లి బిడ్డలకు దైవభక్తి నేర్పుతుంది. యునీకే తిమొతికి అలా నేర్పింది. ఆమె తర్ఫీదు వల్లనే అతడు తర్వాత గురువై బిషప్పయి క్రైస్తవ సమాజాలకు అధిపతి అయ్యాడు. నేడు మన తల్లులు కూడ యునీకేను చూచి బిడ్డలను విశ్వాసంలో పెంచడం నేర్చుకోవాలి. నూలు ఏలాంటిదో చీర ఆలాంటిదౌతుంది. తల్లియేలాంటిదో బిడ్డడు ఆలాంటివాడు ఔతాడు.

నూత్నవేదం లోయి యునీకేలను గూర్చి ఒకసారిమాత్రమే ప్రస్తావించింది. కాని వాళ్లు “నిక్కమైన విశ్వాసాన్ని తమ బిడ్డడికి అందించిన ఆదర్శమాతలు. తమ బిడ్డడికి బైబులు బోధించిన భక్తమాతలు. “బాలుడికి తాను నడవవలసిన మార్గాన్ని బోధిస్తే అతడు పెరిగి పెద్దవాడయిన పిదప కూడ ఆ త్రోవను విడనాడడు" అంటుంది సామెతల గ్రంథం - 22,46. ఇంకా యిదేపుస్తకం

"జ్ఞానికి పుట్టువు నిచ్చిన తండ్రి ప్రమోదం చెందుతాడు. నీవు నీ తండ్రికి ఆనందం, నీ తల్లికి సంతసం చేకూర్చుదువుగాక"

అంటుంది -23, 24-25. ఈ వేదవాక్యాలు తిమొతి తల్లి అమ్మమ్మలపట్ల పూర్తిగా నెరవేరాయి. నేడు మన తల్లులు కూడ ఈ వాక్యాలను సార్ధకం చేసికోవాలి. తమ బిడ్డలను చిన్ననాటినుండే భక్తి విశ్వాసాలతో పెంచాలి. తల్లలు బిడ్డలకు చిన్ననాడే పవిత్ర గ్రంథాన్ని నేర్పాలి.