పుట:Bibllo Streelu new cropped.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

46. రోడా - అచ.1212-16 చెరనుండి తప్పించుకొని వచ్చిన పేతురు మరియు యింటి తలుపు తట్టగానే రోడా అనే బానిసపిల్ల తలుపు తీయడానికి వచ్చింది. గ్రీకు భాషలో రోడా అంటే రోజాపూవు. ఈ బాలిక ఉత్సాహం కలది. సంతోష చిత్తురాలు, త్వరితగతిని అటూయిటూ తిరిగేది.

పేతురు వచ్చేటప్పటికీ మరియు యింటిలోని భక్తులు ప్రార్ధన చేస్తున్నారు. పేతురుకి కారాగార విముక్తి కలిగించడానికే వారి ప్రార్ధన -అ.చ. 12.5. రోడా కూడా ఆ భక్తులతో కలసి ప్రార్ధన చేసూ వుండవచ్చు పేతురు తలుపుకొట్టి శబ్దం చేయగానే ఆమె పరుగెత్తుకొని వచ్చింది. అది రాత్రివేళ. యూదుల భయం వలన ఇంటి తలుపులు మూసి వుంచారు. ఐనా రోడా ధైర్యంతో తలుపు దగ్గరికి వచ్చింది.

లోపలి జనం ఎవరికొరకు జపిస్తున్నారో అతడు వచ్చి తలుపు తడుతున్నాడు. రోడా పేతురుని చూడలేదు. అతని స్వరాన్ని మాత్రం గుర్తుపట్టి అతడు పేతురు అని గ్రహించింది. తాను వచ్చిన పనిని పూర్తిగా మర్చిపోయింది. పట్టరాని సంతోషంతో తలుపు తీయకుండానే యింటిలోనికి పరుగెత్తి పేతురు వచ్చాడనే శుభవార్తను తెలియజేసింది. ఆమె సంతోషం పేతురుకి విముక్తి కలిగినందులకు. లూకా సువిశేషంలో చాలసార్లు ఈ సంతోషపదం వస్తుంది. విశేషంగా భక్తులు ఆత్మను పొందినపుడు అతడు ఈ పదాన్ని వాడతాడు.

రోడా పేతురు వచ్చాడని చెప్పగా లోపలి జనం నమ్మలేదు. నీవు వెర్రిదానివి అన్నారు. చెరలో వున్నపేతురేమిటి? అపరాత్రిలో ఇప్పడు ఈ యింటికి రావడమేమిటి? రోడాకు మతిపోయి వుంటుంది అనుకున్నారు.

ప్రజలు తన మాటను నమ్మకతన్ను పిచ్చిదాని క్రింద లెక్కకట్టినా రోడా మాత్రం తాను తెచ్చిన వార్త ముమ్మాటికి నిజమేనని వాదించింది. ఆమె పేతురుకి చెరనుండి విముక్తి కలిగిందనే శుభవార్తను తెచ్చింది.ఆ సమాచారం తప్పేలా ఔతుంది?