పుట:Bibllo Streelu new cropped.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వుపచారాలు చేసేవాళ్లు తమ సొంత ధనంతోనే వాళ్లకు అన్నపానీయాలు సేకరించి పెట్టేవాళ్లు. వీరిలో మగ్డలీన ముఖ్యురాలు -లూకా 8,1-3. ఆమె కుటుంబాన్ని గూర్చి గాని తల్లిదండ్రులను గూర్చిగాని సువిశేషాలు ఏమీ చెప్పవు. కనుక ఆమె క్రీస్తు ప్రయాణాలల్లో నిరంతరం అతని వెంట పోతుండేది అనుకోవచ్చు.

ప్రభువు ఆమెనుండి ఏడు దయ్యాలను వెళ్లగొట్టాడని లూకా సువిశేషం చెప్తుంది. యూదుల భావాల ప్రకారం ఏడు పరిపూర్ణతను తెలియజేసే సంఖ్య కనుక మగ్గలీనకు ఏడు దయ్యాలు పట్టాయంటే அல் పరిపూర్ణంగా దయ్యం ఆధీనంలో వుండిపోయిందని భావం. నిండు వారానికి ఏడురోజులు, ఏడుసార్లు మన్నించిందే నిండు మన్నింపు, పరిచర్య చేసే డీకనులు ఏడురు. అలాగే మగ్డలీన పిశాచాలకి పూర్తిగా లొంగిపోయి ఏడుదయ్యాల ఆధీనంలో వుంది. ఇక పూర్వులు మానసిక వ్యాధిని కూడ దయ్యం పట్టడం ਨੇ భావించేవాళ్లు. కనుక మరియు ఏదో తీవ్రమైన మానసిక వ్యాధితో బాధపడుతుండేది అనుకోవచ్చు.

చాలావుంది తెలియక మరియు ముగ్డలీన వ్యభిచారిణి అనుకొంటారు. ఇది పొరపాటు. మగ్డలీన పవిత్రురాలు. మార్త చెల్లెలు బెతనీ నివాసియైన మరియు కూడ పరమ పవిత్రురాలు. ఇంకొక బెతనీ మరియు కూడ వుంది. ఈమె క్రీస్తు పాదాలకు పరిమళం పూసింది. ఈమె వ్యభిచారణియై క్రీస్తు బోధల వల్ల పరివర్తనం చెందింది -లూకా 7,36-50. ఈ ముగ్గురు మరియలు వేరువేరు. ఐనా ఆరవ శతాబ్దం నుండి తిరుసభలో మరియు మగ్డలీన, వ్యభిచారిణియైన మరియు ఒకరేననే భావం ప్రచారంలోకి వచ్చింది. ఇది దురదృష్టకరం. మగ్గల నగరం వ్యభిచారిణులకు నిలయమనీ కనుక ప్రభువు దాన్ని నాశం చేశాడనీ పూర్వవేద రబ్బయిలు వ్రాశారు. ఈ రాతవల్ల భ్రాంతిపడి కాబోలు క్రైస్తవులు మరియు మగ్డలీన కూడ వ్యభిచారిణి అనుకొన్నారు. కాని ఇది పొరపాటు.

క్రీస్తు మగ్డలీన మానసిక్తప్త్వాధిని, లేక ఆమెకు పట్టియున్న