పుట:Bibllo Streelu new cropped.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొంతకాలానికి ఇద్దరు కొడుకులు కూడ మరణించారు. ఇక ముగ్గురు వితంతువులు మాత్రమే మిగిలి పోయారు. నవోమికి ఇక ఆ దేశంలో వుండ బుద్ధిపుట్టలేదు. అంతలో యూదయా దేశంలో వానలు కురిసి పంటలు పండాయని వార్తలు వచ్చాయి

కనుక నవోమి స్వీయదేశానికి వెళ్లిపోవాలనుకొంది. కోడళ్లను పుట్టినింటికి వెళ్లిపొమ్మంది. పెద్దకోడలు ఓర్ఫా వెళ్లిపోయింది. కాని చిన్నకోడలు రూతు అత్తను వదలి వెళ్లడానికి ఇష్టపడలేదు. నీ దేశం నా దేశం, నీ ప్రజలు నా ప్రజలు, నీ దేవుడు నా దేవుడు అంది. అత్త మంచీ, వేము తీపీ లేదు అని సామెత. ఐనా ఈయత్తా కోడళ్ల అనుబంధం మాత్రం ఆదర్శప్రాయమైంది. సరే, అత్తాకోడళ్లు యూదయలోని బేశ్లేహేముకి తిరిగి వచ్చారు. నవోమి తన పేరును “మార" గా మార్చుకొంది. ఆ పేరుకి చేదుతనం అని అర్థం. ఆమె మోవాబుకి పోయినప్పడు సంతోషహృదయ. అక్కడి నుండి తిరిగి వచ్చినపుడు విషాదహృదయ. అచటికి వెళ్లినపుడు భర్తకుమారులతో పరిపూర్ణంగా వెళ్లింది. ఇచటికి వచ్చినపుడు భర్త కుమారులను కోల్పోయింది. చేతిలో చిల్లిగవ్వలేదు. కనుక శూన్యహృదయ ఐంది. కావుననే తనపేరు మార అని మార్చుకొంది.

రూతు బేత్తెహేములో ధనికుడైన బోవసుమన్ననకు నోచుకొంది. అతడు ఎలీమెలెకుకు దగ్గరి బంధువు. నవోమి తన భర్త కుటుంబాన్ని నిలబెట్టాలని తపించిపోయింది. బోవసుద్వారా రూతుకి సంతానం కలిగితే ఆకుటుంబం నిలుస్తుంది. కనుక కోడలిని రేయి బోవసు కళ్లందగ్గరికి పంపింది. రూతు కళ్లంలో నిద్రించే బోవసుప్రక్కన పరుండి తనకు ఆశ్రయమిరాయమని వేడుకొంది. బోవసు రూతు సంతానేచ్ఛను గ్రహించి దేవరన్యాయం ప్రకారం అమెను భార్యగాస్వీకరించాడు. అంతానవోమి ప్రణాళిక ప్రకారమే జరిగింది. ఇంకా దైవనిర్ణయం కూడ నెరవేరింది.

రూతుకి బోవసువలన కుమారుడు కలిగాడు. అతనికి ఓబేదు