పుట:Bibllo Streelu new cropped.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మోషే యిస్రాయేలు ప్రజలను ఫరోదాస్యంనుండి విడిపించి ఎడారిగుండా కనాను దేశానికి తీసికొనిపోతున్నాడు. దారిలో యిత్రో కూతురుని మనుమలను తోడ్కోనివచ్చి మోషేకు అప్పగించాడు. కాని ఆమె మోషేతో కనాను దేశానికి వెళ్లినట్లుగా కనిపించదు. ఆ విూదట ఆమె ఏమైందో బైబులు చెప్పదు.

మోషే యావే భక్తుడు. సిప్పొరా మిద్యానీయులు కొలిచే అన్యజాతి దేవుళ్లను పూజించేది. బహుశ మత విషయాన్ని పురస్కరించుకొని వారికి మనస్సులు కలిసి వుండకపోవచ్చు. మోషే యిస్రాయేలు ప్రజలకు సంపాదించి పెట్టిన విమోచనంలో ఆమె పాలు పంచుకోలేదు. అంత గొప్ప నాయకుడి భార్యయైనా వాళ్లిద్దరికి అన్యోన్య సంబంధం వున్నట్లు కనిపించదు. ఆమె మోషేను చావునుండి కాపాడి అతనికి రక్షకి ఐంది. అతడు యిస్రాయేలు జనానికి రక్షకుడు. కనుక వాళ్లిద్దరూ రాబోయే క్రీస్తు రక్షకునికే సూచనంగా వుంటారు.

12. విజయగీతం పాడిన మిర్యాము

మిర్యాము అనే పేరుకు ఈజిప్టు భాషలో ప్రేమ అని అర్థం. యూద రబ్బయులు మాత్రం ఆ పేరుకి చేదుతనం అని అర్థం చెప్పారు. నూత్న వేదంలో మరియమాత పేరు ఈమె పేరే. మిర్యాము అమ్రాను కొమార్తె. అహరోను మోషేలకు సోదరి. ఆమె ఎనిమిదేండ్ల యీడున వున్నప్పుడు మోషే శిశువును దాచిన బుట్టకు కాపలా కాసింది. ఫరో కూతురుతో శిశువుకు పాలియ్యడానికి దాదిని పిల్చుకుని వస్తానని చెప్పి సొంతతల్లినే పిల్చుకొని వచ్చింది. దీన్ని బట్టి ఆమె తెలివితేటలు ధైర్యముగల బాలిక అనుకోవాలి. ఆమె మోషే శిశువును ప్రాణాపాయం నుండి కాపాడింది.

యిస్రాయేలు ప్రజలు రెల్ల సముద్రం దాటాక మిర్యాము స్త్రీలకు నాయకత్వం వహించింది. వాళ్లు నాట్యం చేస్తూ ప్రభువు మహావైభవంతో విజయం సాధించాడు అని పాళ్తారు. ఈ గీతాన్ని బట్టి మిర్యాము