పుట:Bibllo Streelu new cropped.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మరియు వ్యభిచార వృత్తివల్ల కళంకితురాలై చెడ్డపేరు తెచ్చుకొంది. ఆమె క్రీస్తు బోధవిని పరివర్తనం చెందింది. పశ్చాత్తాపంతో గాఢభక్తితో అతని పాదాలపై కన్నీరు కార్చింది. వాటిని తన తలవెండ్రుకలతో తుడిచింది. పరిమళ తైలంతో అభిషేకించింది. ఆమె హృదయం కృతజ్ఞతా భావంతో నిండిపోయింది - లూకా 7,36-38.

వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని ప్రభువు మరణం నుండి కాపాడాడు. కనుక ఆమె తన పాపాల కొరకు పశ్చాత్తాపపడి కన్నీరు కార్చింది. కృతజ్ఞతా పూర్వకంగా తన పాప జీవితాన్ని మార్చుకొంది - యోహా 8,10-11. అలాగే సమరయ ప్రీ కూడ యేసు బోధల వల్ల పరివర్తనం చెందింది. కృతజ్ఞతా పూర్వకంగా వూల్లోకి వెళ్లి ప్రజలను పిల్చుకొని వచ్చి వారికి క్రీస్తుని చూపించింది - యోహా 4,28-30. క్రీస్తుని సిలువ వేసేప్పడు ఒక్క యోహాను తప్ప తతిమ్మా శిష్యులంతా పారిపోయారు. కాని ప్రభువు శిష్యురాళ్లు అలా పారిపోలేదు. వాళ్లు సిలువ దగ్గరే నిలబడి వున్నారు. ఆ భక్తురాళ్లు మరియమాత, ఆమె సోదరి, క్లోపా భార్యయైన మరియు, మగ్గల మరియు మొదలైనవాళ్లు. వీళ్లంతా గలిలీ నుండి యెరూషలేముకి వచ్చారు. వీళ్లు పిలాతు తీర్పుని విన్నారు. సిలువమార్గంలో క్రీస్తుని వెంబడించి వచ్చారు. అతడు సిలువపై చనిపోయేప్పడు దాపులోనే వున్నారు. క్రీస్తుని సిలువవేసే సైనికులు అతని శిష్యురాళ్లయిన ఈ స్త్రీలను దయతో చూచివుండరు. వాళ్లను కసురుకొని భయపెట్టి వుంటారు. వాళ్లపట్ల మొరటుగా ప్రవర్తించి వుంటారు. ఐనా ఈ పుణ్యాంగనలు ఏమీ వెనుకాడలేదు. ప్రభువు చనిపోయే వరకు అతనికి సానుభూతి చూపుతూ, అతనికి అండగా దగ్గరే నిలుచున్నారు. చివరి గడియ వరకు అతనికి తమ ప్రేమనూ కృతజ్ఞతను తెలియజేశారు -యోహా 19.25.

మరియు మగ్డలీన ఆదరమూ భక్తీ తక్కువేమి కాదు. ఆమె క్రీస్తు కోసం తోటలో సమాధివద్ద గాలించింది. అతని శరీరం కన్పిస్తే ఎత్తుకొని పోవాలనుకొంది. ఆ కోరిక "চি" నిదర్శనం. ఉత్థాన క్రీస్తు