పుట:Bibllo Streelu new cropped.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రాయంలో పెండ్లిజేసేవాళ్లు. పెండ్లి సొంత తెగలోనే కుదిర్చేవాళ్లు. వరుడు వధువు తండ్రికి కన్యాశుల్కం చెల్లించాలి. ఆమె బంధువులకు కానుకలీయాలి. వివాహంతో వధువు వరుని ఆస్తిఔతుంది. అతడు ఆమెకు యజమానుడు, అధిపతి (బాలు) ఔతాడు- నిర్గ 20, 17. మగబిడ్డను కనిన స్త్రీకి మన్నన వుంటుంది. ఆడబిడ్డలను కనినా, అసలు బిడ్డలనే కనకపోయినా ఆమెను నీచంగా జూచేవాళ్లు. స్త్రీకి వ్యక్తిగా విలువలేదు. మగబిడ్డలను కనినదానినిబట్టీ, కాయకష్టం చేసిన దానినిబట్టీ ఆమెకు విలువ వుంటుంది, అంతే. ఐనా యూదులు బిడ్డల తల్లిని గౌర వించేవాళ్లు. కొన్ని సందర్భాల్లో భార్యలు భర్తలకు గౌరవం తెచ్చిపెట్టారు. దెబోరా, యూదితు మొదలైనవాళ్లు ఈలాంటివాళ్లు, యూదమహిళలకు గౌరవమిచ్చేది మాతృత్వం. కన్యాత్వం, వంధ్యాత్వం శాపాలు. మొదటలో యూదులు ఏకపత్నీవ్రతులే. కాని కాల క్రమేణ బహుభార్యాత్వం వ్యాప్తిలోకి వచ్చింది. కనుక సంపన్నులైన పురుషులకు సొంత భార్యలతోపాటు ఉపపత్నులు కూడ వుండేవాళ్లు. వీళు ఉంపుడుగత్తెలుకాడు, నిజమైన భార్యలే. కాని వీళ్ల బిడ్డలకు వారసపహక్కు వుండదు. భార్య వ్యభిచారం భర్త హక్కులను భంగపరుస్తుంది. కనుక అతడు ఆ నేరం కారణంగా ఆమెకు విడాకులీయవచ్చు. ఈ సందర్భంలో అతడు విడాకుల చీటినిచ్చి ఆమెను ఇంటినుండి పంపివేయవచ్చు. భర్త వ్యభిచారం భార్య హక్కులను భంగపరుచదు. అసలు ఆమెకు హక్కులనేవి వుంటేగదా. పురుషుడు కన్యతో వ్యభిచరిస్తే అది నేరం కాదు. ఎందుకంటే ఆమెకు భర్తలేడు కనుక పురుషుని హుక్కుల కేభంగం కలుగదు. మగవాళ్లే గాని ఆడవాళ్లు విడాకులు ఇచ్చేవాళ్లు కాదు. విధవలు పెద్దకుమారుని పోషణంలో వుండేవాళ్లు. పెద్దకొడుకు పట్టించుకోకపోతే సమాజం, దుష్ణులైన న్యాయాధిపతులు కూడ వాళ్లను దోచుకోనేవాళ్లు. ఐనా యూద స్త్రీలకు ఫ్రో లేకపోలేదు. వాళ్లు పర్గా