పుట:Bibllo Streelu new cropped.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యెలిసబేతుకి దాసురాలయింది -లూకా 1,39. ఇంకా కానాపూరిలో పెండ్లి వారింటిలో రసమైపోతే క్రీస్తు ద్వారా ఆ కొరతను తీర్చింది - యోహా 2. క్రీస్తు ఉత్థానమయ్యాక శిష్యులతో గూడి మీదిగదిలో ఆత్మరాకడ కొరకు ప్రార్థన చేసింది -లూకా 1,14. క్రీస్తు పోయాక అతని స్థానం పొంది శిష్యులను ఊరడించింది. ఈనాడు కూడ ఆమె ఈలాగే తిరుసభకు పరిచర్యలు చేస్తుంటుంది. పేదరికంలో ప్రుగుతూ, అక్కరలతో అలమటిస్తూ, హింసలకు గురవుతూ, నానాయాతనలు అనుభవించే తిరుసభను ఆదుకొంటూంటుంది. మరియు క్రీస్తు తల్లి, తిరుసభ తల్లి. మన తల్లి బిడ్డలు కూడ తల్లిలాగే వుండాలి. మరియు పోలికలు మనలో కన్పించాలి. కాని అలా కన్పిస్తున్నాయా? ఇది మనందరికీ ఓ సవాలు. 67. క్రీస్తు-స్త్రీలు 1. యూద సమాజంలో స్త్రీల స్థానం క్రీస్తు స్త్రీలతో మెలగిన తీరును అర్ధంచేసుకోవాలంటే మొదట ఆనాటి యూద సమాజంలో స్త్రీలకున్న స్థానాన్ని సరిగా గ్రహించాలి. యూద మహిళలు మైనరు వ్యక్తుల క్రిందేలెక్క కనుక న్యాయసభల్లో వాళ్లు సాక్ష్యం చెల్లదు. వాళ్లు కోర్టుకు వెళ్లి న్యాయాన్ని పొందలేరు. స్త్రీలకు చదువు ఎంతమాత్రం వుండేదికాదు. వాళ్లు బైబులు చదవలేరు. రబ్బయుల దగ్గర ధర్మశాస్త్రం చదువుకొనేది మగపిల్లలు మాత్రమే. స్త్రీలకు ఆస్తిహక్కులేదు. తండ్రికి మగసంతానం లేనప్పడు మాత్రమే అతని ఆస్తి కూతురుకి సంక్రమించేది. ఇంటిపని విశేషంగా మహిళలది. వాళ్లు భోజనం సిద్దం జేయాలి, నీళ్లు తీసికొని రావాలి, బట్టలు తయారుచేయాలి. కనుక పిండి విసరి రొట్టెలు కాల్చడం, వంటచెరకు నీళ్లు తీసికొని రావడం, బట్టలు నేయడం కుట్టడం మొదలైన నానా కార్యాలతో అడవాళ్లు దినమంతా సతమతమై పోయేవాళ్లు. వీటితోపాటు మందలుకాయడం, పొలంలో పైరువేసి కోతకోయడం మొదలైన వ్యవసాయపు పనుల్లోగూడ స్త్రీలు పాల్గొనేవాళ్లు యూదులది పోజ్జ యువతులకు 12-13 ఏండ్ల