పుట:Bibllo Streelu new cropped.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కన్యాత్వం క్రైస్తవులమైన మనకు గౌరవప్రదమైంది. కాని అది యూదులకు దైన్యాన్ని సూచించేది. వాళ్లకు బిడ్డలను కనడం ధన్యత. కనలేకపోవం శాపం, దీనావస్థ. కనుక మరియు తన మంగళగీతంలో ప్రభువు నా దీనావస్థను కటాక్షించాడు అని చెప్పకొంది. ఇక్కడ ఆమె దీనావస్థ ఆమె కన్యాత్వమే. కన్యగా బిడ్డను కనలేకపోవడమే - లూకా 1,48. అతడు ఎడారిని జలమయం చేసేవాడు. మరుభూమిలో నీటిబుగ్గలు, పుట్టించేవాడు - కీర్త 107,35. అతడు ఎండిపోయిన సారాగర్భాన్ని ఎలిసబేతు గర్భాన్ని పండించాడు. అలాగే ఇప్పుడు మరు భూమిగా వున్న మరియు గర్భాన్ని గూడ పండిన పంటపొలంలా చేశాడు. ఆమె గర్భఫలమే క్రీస్తు - లూకా 1,42. అతడు ఇలా ఊరూ పేరూ లేని వారిని ఎన్నుకొని తనకు మహిమను తెచ్చుకొన్నాడు -1కొ 1,27. 4. విమోచకురాలు మరియు ఎలిసబేతు ఎదుట స్తుతిగీతం పాడింది. ఆ గీతంలో ప్రభువు అహంకారుల దురాలోచనలు విచ్ఛిన్నం కావిస్తాడని చెప్పింది. అధిపతులను ఆసనాల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తుతాడని పల్కింది. ధనవంతులను వట్టి చేతులతో పంపివేసి ఆకలిగొన్నవారిని సంతృప్తి పరుస్తాడని నుడివింది -లూకా 1,51-52. ఇవి ప్రభువు పేదలను విమోచించే కార్యాలు. ఈ విషయంలో మరియకూడ క్రీస్తుతో కలసి పనిచేస్తుంది. పేదల విమోచననాకి తానుకూడ కృషి చేస్తుంది. రెల్లు సముద్రం దాటాక మిర్యాము విజయగీతం పాడింది -నిర్గ 15,20. యాయేలు కనానీయుల సైన్యాధిపతియైన సిస్తాను వధించాక దెబోర విజయగీతం పాడింది -16. ఈ వీరవనితలంతా దేవుని న్యాయాన్ని విమోచనాన్నీ కొనియాడారు. అలాగే ఇక్కడ మరియకూడ యిస్రాయేలుకు విడుదల దయచేసిన ప్రభువుని స్తుతించింది. 5. సేవకురాలు మరియు పర్వతసీమలో వసించే ఎలిసబేతు ఇంటికి వెళ్లి ఆమెకు పురుడుబోసి సాయం క్కేవ దాసురాలు నిజంగానే