పుట:Bibllo Streelu new cropped.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పాటించేవాళ్లు మరింత ధన్యులు అన్నాడు - లూకా 11.27-28. దేవుని వాక్కును వినడం పాటించడం శిష్యధర్మం అని చెప్పాం. మరియు పరిపూర్ణ శిష్యురాలు. ఇదిగో ఏలినవారి దాసురాలిని, నీ మాట చొప్పన నాకు జరుగును గాక అన్నపుడు ఆమె శిష్యత్వం పరిపూర్ణత මුංයීෆයි. -లూకా 1,37. క్రీస్తు స్వయంగా దైవచిత్తాన్ని పాటించినవాడు. కనుకనే అతడు దేవా! నీ చిత్తాన్ని పాటించడానికే నేను వచ్చాను అన్నాడు -హెబ్రే 10,7. మరియకూడ ఈ క్రీస్తు లాగే దేవుని చిత్తాన్ని పాటించింది. ఆమె క్రీస్తు వాక్కుని విని పాటించడం మాత్రమే కాదు. దాన్ని తన హృదయంలో నిల్పుకొని ధ్యానం చేసికొందికూడ - లూక 2.19-51 మరియలాగే తిరుసభ కూడ దేవుని వాక్కు వినాలి, పాటించాలి, ధ్యానించాలి.

2. తిరుసభకు తల్లి

సిలువ క్రింద నిల్చియున్న మరియను యోహానుకి తల్లిగా అప్పగించాడు ప్రభువు - యోహా 19,27. ఈ యోహాను క్రీస్తుని విశ్వసించే శిష్యులందరికి ప్రతినిధి. కనుక మరియు విశ్వాసులందరికీ తల్లి. ఈ విశ్వాసులే తిరుసభ. కావున ఆమె తిరుసభకు తల్లి. ఇక్కడ తిరుసభకు తల్లి అంటే ఆ తిరుసభకు సేవలు చేసేది అని అర్థం.

3. కన్య

ఇదిగో కన్య గర్భం ధరించి కుమారుని కంటుంది అన్నాడు మత్తయి -1.22. ఈ వాక్యం యెషయా గ్రంథం 7, 14లోనిది. కాని హీబ్రూ మూలంలో ప్రవక్త యువతి కుమారుని కంటుంది అని మాత్రమే చెప్పాడు. ఈ "యువతి" అన్న పదాన్ని మత్తయి బుద్ధి పూర్వకంగా కన్య అని మార్చాడు. అంతకు ముందే సెప్తవాజింత్ గ్రీకు అనువాదం కూడ అలాగే మార్చింది. మత్తయి నాటికే తిరుసభలో మరియు కన్యాత్వం గణుతికెక్కింది. నాల్గవ శతాబ్దపు క్రైస్తవులు ఆమెను నిత్యకన్య అని స్తుతిస్తూ వచ్చారు. L