పుట:Bibllo Streelu new cropped.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కేవలం శారీరకమైన తల్లి మాత్రమే కాదు. ఆధ్యాత్మికమైన తల్లికూడ. అనగా విశ్వాసమూ విధేయతా వాక్య భక్తి మొదలైన గుణాలుకల తల్లి ఈ దివ్యగుణాలే ఆమెను శిష్యురాలినిగా చేశాయి. ఒకప్పుడు ప్రజలు క్రీస్తుకి మతి చలించిందనుకొన్నారు-మార్కు 3,21. కనుక అతని తల్లి సోదరులు అతన్ని ఇంటికి తీసికొని పోవడానికి వచ్చి వెలుపల వేచి వున్నారు. కొందరు వచ్చి మీ తల్లి సోదరులు నీ కొరకు వెలుపల వేచివున్నారని క్రీస్తుతో చెప్పారు. ఆ మాటలకు ప్రభువు నా తల్లి యెవరు? నా సోదరు లెవరు? దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడే నాకు సోదరుడు, సోదరి, తల్లి అన్నాడు - మార్కు 3,35. ఇక్కడ క్రీస్తు భావం ఏమిటి? మరియు తనకు శారీరకంగా తల్లి కావడం వల్లనే ధన్యురాలు కాలేదు. దేవుని చిత్తాన్ని నెరవేర్చింది గావున ధన్యురాలైంది. దైవచిత్తాన్నిపాటించడం, దేవుని వాక్కుకి విధేయత చూపడం శిష్యధర్మం. మరియు పరిపూర్ణ శిష్యురాలు. కాని ఆమె శారీరక మాతృత్వం కంటె ఆమె విధేయత గొప్పది. విధేయత ద్వారా మరియు తనకు తానూ మానవ జాతికి గూడ రక్షణాన్ని ఆర్జించి పెట్టింది అన్నాడు ఇరెనేయస్ వేదశాస్త్రి మరియు క్రీస్తుని గర్భంలో ధరించకముందే హృదయంలో ధరించింది. ఆమె ప్రభుని గర్భాన ధరించినడానికంటె అతన్ని విశ్వసించడం ద్వారా అధికంగా ధన్యురాల యింది అన్నాడు అగస్టీను భక్తుడు. క్రీస్తుని హృదయంలో ధరించే ప్రతి భక్తుడు అతనికి తల్లికావచ్చు అన్నాడు గ్రెగోరీ భక్తుడు. క్రీస్తుని ఆధ్యాత్మికంగా కన్న వాళ్లందరికి మరియు అనేపేరు వర్తిస్తుంది అన్నాడు ఆంబ్రోసు భక్తుడు. ఈ పట్టున లూకా సువిశేషం “దేవుని వాక్కుని ఆలించి పాటించే వాళ్లే నాకు తల్లీ సోదరులూ ఔతారు” అని చెప్తుంది -8,21. దేవుని వాక్కుని పాటించడమన్నా దేవుని చిత్తాన్ని నెరవేర్చడమన్నా ఒకటే. ఇంకా, ఓ స్త్రీ క్రీస్తునుద్దేశించి నిన్ను మోసిన గర్భమూ నీకు పాలిచ్చిన స్తనములూ ధన్యమైనవి అంది. కాని ప్రశ్ర్యతో దేవుని వాక్కుని ఆలించి