పుట:Bibllo Streelu new cropped.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆ రోగి తన్ను తాకగానే తనలోని శక్తి వెలుపలికి వచ్చిందని క్రీస్తు గుర్తించాడు. అది వ్యాధులను నయంజేసే పవిత్రాత్మ శక్తి - లూకా 5,17. అలా గుర్తించగా ప్రభువు నా వస్తాన్ని తాకిందెవరని తన చుటూవున్న జనాన్ని ప్రశ్నించాడు. అతని చుటూ పెద్ద జనసమూహం మూగి వుంది. అద్భుతాలు చేసే ఆ ప్రభువును కండ్లార చూడాలనీ, అతన్ని తాకిచూడలనీ కూడ ఆ ప్రజల కోరిక. కనుక వాళ్లు ఒకరినొకరు త్రోసికొంటూ అతనిమీద పడుతున్నారు. ఐనా వాళ్లకు మన రోగికి లాగ విశ్వాసం లేదు. కుతూహలంతో మాత్రమే అతన్ని ముట్టారు. కనుకనే ఆమెకులాగ వాళ్లకు ఆరోగ్యం కలుగలేదు.

క్రీస్తు అడిగిన ప్రశ్నకు శిష్యులు విస్తుపోయి అయ్యా! ఇంతమంది జనం త్రోసికొంటూ వచ్చి నీ మీద పడుతూంటే నా వస్రాలు తాకిందెవరని అడుగుతున్నావేమిటి అని అన్నారు. క్రీస్తు తన బట్టలను తాకిన వ్యక్తిని గుర్తు బట్టడానికి జనంలోకి తేరిపారజూస్తున్నాడు.

ఆ భక్తురాలు క్రీస్తు దగ్గరకు వచ్చి నేనే నీయంగీని ముట్టానని చెప్పడానికి భయపడింది. భయమెందుకంటే తాను శారీరకంగా అపవిత్రురాలై యుండికూడ క్రీస్తు అంగీని తాకి అతన్ని మైలపరచింది కనుక, కడన తన భయాన్ని ఏలాగో అణచుకొని ప్రభువు దగ్గరికి వచ్చి అయ్యా! నీ వస్తాన్ని తాకింది నేనే. నీవు నన్ను క్షమించు. నీ దయవల్ల నాకు ఆరోగ్యం చేకూరింది అని చెప్పింది. అంతమంది ప్రజల యెదుట కూడ ఆమె తన కృతజ్ఞతను వెల్లడిజేసికొంది - లూకా 847.

కననీయ స్త్రీని తన తల్లినీ గూడ “ఓ స్త్రీ' అని సంబోధించిన ప్రభువు ఈమెను మాత్రం “కుమారీ" అని పిల్చాడు. ఆ పిలుపులో ఎంతో జాలీ ఆప్యాయతా వున్నాయి. తమ ధర్మశాస్త్ర భావాల ప్రకారం యూదులు తలంచినట్లుగా ఆమె యిప్పడు అశుదురాలుకాదు. శుద్ధురాలు. ఆమె యిప్పుడు అబ్రాహాము కొమార్త యోగ్యురాలు. కనుక యూదులు కూడ ఆమెను యోగ్యురాలినిగానే అంగీకరించాలని ప్రభువు భావం - లూకా 13, 16.