పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అని ప్రవచించాడు - 31,12. నూత్నవేదంలో క్రీస్తు అప్పడప్పడు విందులారగింప బోయేవాడు. అందుకు శత్రువులైన పరిసయులు అతన్ని భోజనప్రియజ్జీగా లెక్కగట్టారు - మత్త 11,19, కాని ఈ విందులన్నీ కడపటి దినాల్లో రాబోయే ఓ గొప్ప విందునకు సూచనంగా వుంటాయి. అదే దివ్యసత్రసాద మహాభాగ్యం. ఆ పరమాహారం క్రీస్తు శరీరమే. ఆ యాహారం అతడు మనకిచ్చిన వరాలన్నిటిలోను శ్రేష్టమైంది. పరలోక జపంలో "ప్రభూ! మాకు కావలసిన అనుదినాహారాన్ని మాకు ప్రతిరోజు దయచేయి" అనే వాక్యం వస్తుంది - లూకా 11,3. యూదుల భావాల ప్రకారం ఈ “యనుదినాహారం" దేవుడు దయచేసే సమస్త వరాలకు సూచనంగా వుంటుంది. ఈ వరాల్లో దివ్యసత్ర్పసాద వరమేమీ తక్కువది కాదు. క్రీస్తు"నేనే జీవాహారాన్ని అని చెప్పినపుడు ఆ వరాన్ని గూర్చి చెప్పిన పై భావాలన్నీ జ్ఞప్తికి వస్తాయి.

2. ఆరాధనంలో ఆహారం

యిస్రాయేలు ప్రజలు ఆరాధనలో ఆహారాన్ని సమర్పించేవాళ్ళ ఈ యాహారం రొట్టెల రూపంలో వుండేది. ఈ యంశాన్ని విపులంగా పరిశీలిద్దాం.

5. సాన్నిధ్యపు రొట్టెలు

యూదులు మొదట గుడారంలోను, తర్వాత యెరూషలేం దేవళంలోను దేవుని సాన్నిధ్యంలో పండ్రెండు రొట్టెలు పెట్టేవాళ్ళ "నిత్యం నాకు సమర్పించవలసిన రొట్టెలను బల్లమీద నా యెదుట వుంచాలి" - నిర్గ 25,30. ఈ పండ్రెండు రొట్టెలను జ్ఞప్తికి తెచ్చుకొని దేవుడు వారిని కాచి కాపాడుతుండేవాడు. తాను వారితో ఐక్యమైయుండేవాడు.

6. కొత్త ధాన్యంతో చేసిన రొట్టెలు

ఇంకా ప్రతి కుటుంబవాళ్ళ వారాల పండుగలో కొత్త ధాన్యంతో చేసిన రొట్టెలు రెండింటిని దేవుని యెదుట అర్పించేవాళ్లు, "ప్రతి కుటుంబం రెండు రొట్టెలు కొనివచ్చి ప్రభువు ఎదుట ఎత్తి అర్పించాలి. వీటిని ఆ యేటి పంటలోని తొలి ధాన్యం నుండే తయారుచేయాలి" - లేవీ 23,17. పంటను దయచేసినందుకు వందనపూర్వకంగా దేవునికి ఈ రొట్టెలు అర్పించేవాళ్ళు యూజకుడూ రాజు ఐన మెల్కీ సెడెక్కుగూడ పూర్వం ఈలాగే సర్వోన్నతుడైన దేవునికి రొట్టె ద్రాక్షరసమూ అర్పించేవాడు - ఆది 14,18-20.

7. పొంగని రొట్టెలు

దేవళంలో బలులు అర్పించేపుడు పొంగని రొట్టెలు కూడ కానుక పెట్టేవాళ్ళ "మీరు నాకు జంతుబలులు అర్పించేపుడు పొంగని రెట్టెలు అర్పించాలి” నిర్గ 23,18.