పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పాత్రలనిండ ద్రాక్షసారాయం సేవిస్తున్నారు
వంటినిండ శ్రేష్టమైన పరిమళం పూసికొంటున్నారు
కాని యిప్రాయేలు ప్రజ నాశమౌతుందే అని
మీకు చింతాకంత జాలిగూడలేదు
ఇకనేం, ప్రవాసానికివెళ్ళే బందీల్లో
మీరే మొదటివాళ్లతారు
అప్పడుగాని మీ పండుగలూ విందులూ
తుదిముట్టవు" - 6, 4–7.
అకాలపు ధనిక స్త్రీలుకూడ పేదప్రజలను పీడించారు. తమ సుఖంకోసం పేదలను
దోచుకొనిరమ్మని భర్తలను పరికొల్పారు. ఆమోసు ఆ ధనవంతులనుకూర్చి ఈలా అన్నాడు:

"సమరయస్త్రీలారా వినండి !
మీరు భాషాను ఆవుల్లాగ తెగబలిసిపోయారు!
మీరు పేదలను బాధించి పీడిస్తున్నారు
మద్యం తీసికొనిరమ్మని మీ భర్తలను వేధిస్తున్నారు.
కానిపరిశుద్దుడైన ప్రభువు ఈలా అంటున్నాడు
శత్రువులు వచ్చి మిమ్మ గాలాలతోపట్టి లాగుతారు
మీరంతా గాలానికి తగిలిన చేపల్లాగౌతారు
గోడలోని గండ్లద్వారా మిమ్మందరినీ
బయటికి ఈడ్చుకొని పోతారు" - 4, 1-4
ఆ కాలంలోని ధనవంతుల దుష్కృత్యాలను ప్రవక్తలు పేర్కొన్నారు, హోషేయ ఈలా
అన్నాడు :

"ఈ దేశప్రజల్లో విశ్వాసంలేదు
దయలేదు, దైవజ్ఞానంలేదు - ఎటుచూచినా
అణలు, కూటసాక్ష్యాలూ, హత్యలూ, దొంగతనాలూ
వ్యభిచారాలూ, నేరాలూ, ఖూనీలూను" - 4, 1-3

ఇంకా మీకా ఈలా వాపోయాడు :
"భక్తిమంతులు భూమిమీద కరవైపోయారు
సత్యవంతులు కలకానికైనా లేరు
ప్రతివాడూ హత్యకు పాల్పడేవాడే
ప్రతివాడు పొరుగువాణ్ణి వేటాడేవాడే