పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 276 P.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

7. సాంఘిక న్యాయం

బైబులు భాష్యం - 35

విషయసూచిక

1. సాంఘిక న్యాయమూ, నిర్గమనమూ 137
2. సాంఘికన్యాయమూ, ధర్మశాస్త్రమూ 141
3. సాంఘికన్యాయమూ, అధికారులూ 149
4. సాంఘికన్యాయమూ, ఆరాధనమూ 155

1. సాంఘిక న్యాయమూ, యూదుల నిర్గమనమూ

ప్రభువు యిప్రాయేలీయులను ఐగుప్తనుండి కనాను మండలానికి తరలించుకొని వచ్చాడు. ఎందుకు? వాళ్ళు సాంఘిక అన్యాయంవల్ల బాధపడుతున్నారు గనుక. ఐగుప్రీయులు యూదులను అన్యాయంగా పీడించి పిప్పిచేస్తున్నారు గనుకనే యావే వాళ్ల కోపు తీసికొన్నాడు. ఇక్కడ రెండంశాలు పరిశీలిద్దాం.

1. ప్రభువు సాంఘిక అన్యాయాన్ని ఎదిరాంచాడు

పూర్వం ఐగుప్మలో కరవురాగా ప్రధాన మంత్రియైన యోసేపు ముందుగనే ధాన్యం నిల్వజేయించి వుంచాడు. అతడు దేశాన్ని వివేకవంతంగా పరిపాలించడం వల్ల ఐగుప్రీయులు కాటకానికి తప్పి బ్రతికారు. నాటి రాజు అతన్ని చాలా మెచ్చుకొన్నాడు. కాని కొంతకాలానికి ఆ రాజవంశం పడిపోయింది. క్రొత్త ప్రభువు అధికారాన్ని చేపట్టాడు. వాళ్లకు యూదుల చరిత్రా, పూర్వం యోసేపు దేశానికి చేసిన ఉపకారమూ ఏమీ తెలియదు.

క్రొత్త రాజవంశాని చెందిన ఫరో ప్రభువు సేతోస్ అనేవాడు యూదులను హింసించడం మొదలెట్టాడు. అతడు వాళ్లచేత వెట్టిచాకిరి చేయించాడు. వాళ్ళ మగబిడ్డలందరిని నైలునదిలో త్రోయించాడు. ఆ జాతి వృద్ధిలోకి రాకుండా వుండాలని అతని కోరిక యుద్దాలు వచ్చినపుడు యిప్రాయేలీయులు శత్రుపక్షంతో చేరిపోతారేమోనని అతని భయం - నిర్గ 1, 10.

సేతోస్ తర్వాత రెండవ రామ్సెస్ ఐగుపుకు ప్రభువయ్యాడు. మోషే నాయకత్వం క్రింద యూదులు ఐగుప్తనుండి వెడలివచ్చింది ఇతని యేలుబడిలోనే, అది క్రీస్తు పూర్వం 13వ శతాబ్దం. రామ్సెస్ రాజు ధాన్యాన్ని నిల్వజేయించడానికి పీతోము, రమేసెసు అనే నగరాల్లో బ్రహ్మాండమైన గిడ్డంగులు నిర్మించాడు. యిప్రాయేలీయులచేత వెట్టిచాకిరి