పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/290

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

27. మన ప్రధాన యూజకుడు మన బలహీనతలపట్ల సానుభూతిచూపలేనివాడు కాదు

- హెబ్రే 4,16.

మనం తరచుగా క్రీస్తు దేవుడని భావిస్తుంటాం. కాని అతడు నరుడుకూడ అని తలంచనే తలంచం. ఇది పెద్ద పొరపాటు. అతడు దేవుడుగానే మనలను రక్షించివుండవచ్చు గదా! మరి నరుడై జన్మించింది దేనికి? మన పతన స్వభావాన్ని అనుభవ పూర్వకంగా తెలిసికోవడానికీ, మనపట్ల సానుభూతి చూపడానికీ, అతడూ మనలాగే నరుడయ్యాడు కనుక, మనలాగే బాధలూ, శోధనలూ అనుభవించాడు. కనుక, మన కష్టసుఖాలను అనుభవపూర్వకంగా తెలిసికోగలిగాడు. పిడికెడు మట్టిముద్దమైన నరుడు ఎంత బలహీనప ప్రాణియో ప్రత్యక్షంగా గుర్తింపగలిగాడు. ఈలాంటి క్రీస్తు దగ్గరికి మనం చనువుతో, స్వతంత్రంతో వెళ్ళాలి. అతడు మనలను చీదరించుకోడు గదా, ఆదరిస్తాడు. అతడు మన తరపున దేవుని యెదుట నిలిచే కృపాసింహాసనం. మన జాతివాడు, మన పెద్దన్న

28. నేను పండుకొని నిద్రపోయాను. మళ్ళా సురక్షితంగా లేచాను. ప్రభువేనన్ను కాపాడాడు

కీర్త 3,5,

దేవునిమీద భారంవేసి జీవించాలని కీర్తనలు మాటిమాటికి చెపూంటాయి. ఓ కీర్తనకారుని అనుభవం ఇది. అతను పండుకొని నిద్రపోయాడు. నిద్రలో మైమరపు కలుగుతుంది. మనలను మనమే మరచిపోతాం. ఈ సమయంలో ఎవరైనా మనకు హాని చేయవచ్చు. పైగా మైమరపు చెందిన మన ప్రాణం మళ్ళా మేల్కోకుండా వుండవచ్చు కూడ. ఐనా అతడు నిద్రనుండి సురక్షితంగా లేచాడు. ఎవరూ తనకు హాని చేయలేదు. తాను పూర్వపు రీతినే కుశలంగా వున్నాడు. ఎందుకు? ఆ నిద్రలో, ఆ మైమరపులో ప్రభువే అతన్ని కాపాడాడు. నిద్ర మన కందరికీ అందుబాటులోవున్న అనుభవమే. కాని నిద్రను గూర్చిన ఈ కీర్తనకారుని తలపోతలు మాత్రం లోతైనవి. మనంకూడా ఇతనిలాగే రోజూ నిద్రపోకముందూ, నిద్రనుండి లేచాకా “ప్రబో! నన్ను కాపాడేవాడివి నీవే?' అని చెప్పకొంటే ఎంత సభ్యతగా వుంటుంది!

29. అతడు అన్ని పనులూ చక్కగా చేసాడు.

- మార్కు7,37.

క్రీస్తు సమకాలికులు అతని బోధలు విన్నారు. అతని అద్భుతాలు చూచారు. అతని నడవడికను గమనించారు. ఇదంతా చూచాక కొంతమంది క్రీస్తును గూర్చి అనుకొన్న