పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/288

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22. దేవుడు నరుడు చూచే చూపున చూడడు. - 1 సమూ 16,1.

దావీదు తండ్రి యిూషాయికి ఎన్మిదిమంది కుమారులు. వారిలో కడగొట్టువాడు దావీదు. యిూషాయి తన పెద్దకొడుకు యెలియాబును సమూవేలు చెంతకు పంపాడు. సమూవేలు యెలియాబు ఆకారాన్ని చూచి మెచ్చుకొని అతన్ని రాజుగా అభిషేకింప బోయాడు. కాని ప్రభువు సమూవేలుతో "ఇతని ఆకారాన్ని చూచి భ్రమసిపోవద్దు. నరుడు వెలుపలి రూపాన్ని మాత్రమే చూస్తాడు. కాని దేవుడు హృదయాన్ని పరిశీలిస్తాడు అన్నాడు. మనం నరులుచేసే వెలుపలి పనులను మాత్రమే చూచి వీళ్ళు మంచివాళ్ళు వీళ్ళు చెడ్డవాళ్లు అని నిర్ణయిస్తాం, కాని భగవంతుడు నరులుచేసే వెలుపలి పనులను మాత్రమే చూడడు. వాళ్ళ హృదయంలోని ఉద్దేశాలనుకూడ గమనిస్తూంటాడు. అందుచేత మన దృష్టిలో మంచివాలైన వాళ్ళంతా దేవుని దృష్టిలో మంచివాళ్ళు కావచ్చు కాకపోవచ్చు. ఆలాగే మన దృష్టిలో చెడ్డవవాజైన వాళ్ళంతా దేవుని దృష్టిలో చెడ్డవాళ్ళు కావచ్చు కాకపోవచ్చు అతని నిర్ణయాలు వేరు, మన నిర్ణయాలు వేరు. కనుక ఇతరులను గూర్చిన మన అభిప్రాయాల్లో పొరపాట్లు ఉండవచ్చు. ఉంటాయికూడ.

23. అతడు మీ మీద శ్రద్ధచూపుతుంటాడు. కనుక మీ చింతలన్నీ అతనికే వదలివేయండి

-1 పేత్రు 5,7.

మనం పసివాళ్లంగా వున్నపుడు తల్లిదండ్రులు మన మీద శ్రద్ధ జూపించారు. కనుకనే మనం ఆపదలన్నీ తప్పకొన్నాం. వృద్ధిలోకి వచ్చాంగూడ, ఈలాగే ప్రభువు కూడ నిత్యమూ తన బిడ్డలమైన మన మీద శ్రద్ద చూపుతుంటాడు. అతని కరుణవల్లనే మనం రోజురోజు ఆపదల నుండి తప్పకొని బ్రతుకుతూన్నాం. అతను ఓ కాపరిలాంటి వాడు, మనం మందలాంటి వాళ్లం అని చెప్తుంది 28 వ కీర్తన. కాపరి మంద మీద శ్రద్ధచూపినట్లుగానే ప్రభువు మన మీద శ్రద్ధ చూపుతూంటాడు. కనుక భక్తుడు తన చింతలన్నీ ఆ తండ్రికే వదలివేయాలి. చింతించినంతమాత్రన్నే మన సమస్యలు తీరిపోతాయా? తీరవు. వాటిని కొద్దిగానో గొప్పగానో తీర్చేవాడు ఆ ప్రభు వొక్కడే

24. నా జీవితమంతా ప్రభు మందిరములోనే గడపాలనుకొన్నాను

- కీర్త 27,4

27వ కీర్తన వ్రాసిన భక్తుడు "నేను ప్రభుని ఒక్క వరమడిగాను. నా జీవితమంతా ప్రభు మందిరంలో గడపాలనీ, ఆయన మంచితనాన్ని చవిచూడాలనీ, ఆయన సలహా పొందాలనీ కోరుకొంటూన్నాను” అంటాడు. పూర్వవేదనరులు మామూలుగా దేవుని నుండి అడిగిన వరాలు నాలు : దీర్గాయువూ, సిరిసంపదలూ, సంతానమూ, శత్రు వినాశమూ,