పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/273

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తన పాప జీవితాన్ని మార్చుకొనే ధైర్యం ఆమెకు లేదు. కనుక భయపడిపోయి అబద్దాలు చెప్పడం ప్రారంభించింది. ఐనా ఆమె పశ్చాత్తాపపడి హృదయ శుద్ధిని పొందితేనే గాని దైవ దర్శనాన్ని పొందలేదు. కనుక ప్రభువు ఆవిడ పశ్చాత్తాపపడి మనసు మార్చుకోవడానికి సహాయం చేసాడు.

5. ప్రభువు ఆమెను వెల్లురుని గ్రహించేలా చేసాడు, 18–20

ప్రభువు వాక్యం వెలురు. ఆ వెల్లురులో నరుడు తన్ను తాను పరిశీలించి చూచుకోవాలి. తన నడవడికను తాను చక్కదిద్దుకోవాలి. కాని పాపి వెలుగు దగ్గరికి రావడానికి భయపడతాడు. తన దుప్రియ లెక్కడ బయట పడతాయోనని జంకుతాడు - యోహా 8,20-21. కనుకనే సమరయ మహిళ భయపడింది, ఆందోళనము చెందింది, అబద్దాలాడింది. ఈ పట్టున ప్రభువు ఆమె పాపాన్ని బట్టబయలు చేసి ఆమె పరివర్తనం చెందడానికి దోహదం చేసాడు. మనసు మార్చుకోడానికి ప్రేరేపించాడు.

ప్రభువు ఆవిడ పాపజీవితపు ఊసెత్తగానే ఆమె అతనికి తన రహస్యాలు తెలుసునని అర్థం చేసికొంది. కనుక అతన్ని దైవభక్తుని గాను ప్రవక్తగాను గుర్తించింది. ఆ రోజుల్లో మహాప్రవక్త ఒకడు విజయం చేస్తాడని యూదులూ సమరయులూ గూడ నమ్ముతూండేవాళ్ళు “నీలాంటి ప్రవక్త నొకట్టి మళ్ళా జనం దగ్గరికి పంపుతాను" అని ప్రభువు పూర్వం మోషేకు వాగ్హానం చేసాడు. ద్వితీ–18, 18. కనుక ప్రజలు ఈ వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నారు. సమరయ స్త్రీ తన రహస్యం తెలియజేసిన ఈ వ్యక్తి పై ప్రవక్తలాంటివాడై వుండవచ్చు ననుకొంది.

ప్రవక్త అన్న భావం మదిలో మొదలగానే ఆమెకు దేవుడూ ఆరాధనమూ గుర్తుకి వచ్చాయి. కనుకనే దేవునీ ఎక్కడ ఆరాధించాలని ప్రశ్నించింది. యూదులు యెరూషలేము కొండమిూద దేవుణ్ణి కొలుస్తున్నారు. కాని సమరయులు అక్కడికి వెళ్లరు. వాళ్ళు గెరిసిం అనే కొండమిూద ఇంకో దేవళం నిర్మించుకొని అక్కడ దేవుణ్ణి కొల్చేవాళ్ళు ఈ రెండింటిలో ఏది నిజమైన ఆరాధనమో చెప్పమని అడిగింది. ఆమె భక్తి గల ఆరాధనం ద్వారా తాను దేవునితో సమాధానపడాలని కోరుకొంది. అనగా ప్రభువు వాక్కు ఆమెకు పరివర్తనం కలిగించడం మొదలెట్టింది అనుకోవాలి.

6. సమరయ స్త్రీ మెస్సీయాను గుర్తించడం, 21–26

యూదుల యెరూషలేము ఆరాధన, సమరయుల గెరిసిం ఆరాధనా కూడ ఇక మిూదట చెల్లవు అన్నాడు ప్రభువు. సమయం ఆసన్నమైంది. అనగా మెస్సీయా కాలం రానే వచ్చింది. ఈ కాలంలో ప్రజలు ఆత్మద్వారాను, సత్యం ద్వారాను తండ్రిని ఆరాధించాలి. అంత్య దినాల్లో అనగా మెస్సీయాకాలంలో, ఆత్మ అందరి విూదా కుమ్మరింపబడుతుంది. కనుక ఆత్మద్వారా తండ్రిని ఆరాధించడం అవసరం. ఇంకా, సత్యం ద్వారాకూడ అతన్ని ఆరాధించాలి. ఇక్కడ సత్యం అంటే క్రీస్తే. అతడు తండ్రి చేసిన రక్షణప్రణాళికను 265