పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

21. మోషే విజ్ఞాపనం - నిర్గ 32, 7-14

1. మోషే సీనాయి కొండ విూద 40 రోజులు ఉపవాస మండి ప్రార్థన చేసాడు. దేవుని నుండి పది ఆజ్ఞలు పొందాడు. కాని అతడు 40 రోజులు దూరంగా కొండ విూద వుండిపోవడం వల్ల క్రింద వున్న (ග්‍රිසඳී భక్తివిశ్వాసాలు నశించాయి. వాళు మోషే అన్నయైన అహరోను చేత బంగారు దూడను చేయించుకొని దాన్ని కొలవడం మొదలెట్టారు. మనలను ఐగుప్తనుండి తోడ్కొని వచ్చిన దేవుడు ఇతడే అని చెప్పకొన్నారు. దానికి బలులర్పించారు. అక్కడ కొండమిూద దేవుడు మోషేను హెచ్చరించాడు. నీవు ఐగుప నుండి తోడ్కొని వచ్చిన ప్రజలు మత భ్రష్టులై అన్య దైవాన్ని కొలుస్తున్నారు. త్వరగా క్రిందికి దిగివెళ్లు అని హెచ్చరించాడు. నేను ఈ జనాన్ని కాల్చి మసిచేస్తాను, నీవు నాకు అడ్డురావద్దు అని చెప్పాడు. ఆ సందర్భంలో మోషే దేవునికి విజ్ఞాపన ప్రార్థన చేసాడు. 2. ఇక్కడ మోషే చేసిన ప్రార్ధనలో నాల్గంశాలున్నాయి. 1. ప్రభువు ఎంతో కష్టపడి యిప్రాయేలీయులను ఐగుపు నుండి తోడ్కొని వచ్చాడు. వాళ్ళను ఇప్పడు నాశం చేస్తే ప్రభువు కృషంతా బూడిదలో పోసిన కన్నీరు కాదా? ఐగుపులో అతడు చేసిన అద్భుతాలన్నీ వ్యర్థం కావా?

2. ఇప్పడు ప్రభువు యిప్రాయేలీయులను చంపివేస్తే శత్రువులైన ఐగుప్రీయులు ఏమనుకొంటారు? యావే వట్టి మోసగాడు. అతడు యిప్రాయేలీయులను ఐగుప్త నుండి నడిపించుకొని వచ్చినట్లేవచ్చి వారిని మోసంతో కొండల్లో చంపివేసాడు అని ఆడిపోసుకోరా? 3. అబ్రాహాము, ఈసాకు యాకోబు అనే పితరుల భక్తిని జ్ఞప్తికి తెచ్చుకోవద్దా? వాళ్లు తనకు చేసిన పూజలను స్మరించుకోవద్దా? ఆ పుణ్యపురుషులను చూచి వాళ్ళ సంతానమైన ఈ దుష్ట ప్రజను మన్నించవద్దా?

4. ప్రభువు పూర్వం ప్రమాణాలు చేసాడు. అబ్రాహాము సంతాన్ని చుక్కల్లాగ, ఇసుకరేణువుల్లాగ లెక్కలకు అందని రీతిగా వృద్ధిచేస్తానన్నాడు. వాళ్ళకు కనాను మండలాన్ని ధారాదత్తం చేస్తానన్నాడు. ఇప్పడు ఈ ప్రజలను చంపివేస్తే ఆ ప్రమాణాలు ఏలా నెరవేరతాయి? ఈ కారణాలన్నిటిని బట్టి అతడు ప్రజలను నాశం చేయకూడదు. ఇది మోషే విజ్ఞాపనం. ఈ ప్రార్థనను ఆలించి ప్రభువు తన మనస్సు మార్చుకొన్నాడు. యిస్రాయేలీయులను శిక్షించకుండ వదలివేసాడు.

3. ఇక్కడ మోషే శీలాన్ని జాగ్రత్తగా గమనించాలి. ప్రభువు యిప్రాయేలీయులను చంపివేసి మోషే నుండి క్రొత్తజాతిని పుట్టిస్తానన్నాడు – 82,10. దీనితో మోషే జాతిపిత కావచ్చు. అబ్రాహాము స్థానాన్ని తాను పొందవచ్చు. నేల విూద తన పేరు శాశ్వతంగా నిల్చిపోతుంది. కాని మోషే స్వార్థం లేని మహానాయకుడు. అతనికి కావలసింది స్వీయకీర్తి కాదు. ప్రజల క్షేమం. అతడు ప్రజల కొరకు జీవించిన నాయకుడు. ఆ జనులను సేవించి వారికి సేవలు చేయడం అతని లక్ష్యం. ఆ ప్రజలు నాశమైపోతే ఇక తానెందుకు, తన