పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మామూలుగా దేవాలయంలోకి వెళ్ళేవాళ్లు దేవుణ్ణి పూజిస్తారు. బలులర్పిస్తారు. కాని పై జాబితాలో దైవారాధనను గూర్చిన అంశం ఒక్కటీలేదు. అన్నీ తోడివారి పట్ల పాటింపవలసిన ధర్మాలే వున్నాయి. అనగా తోడి నరునికి న్యాయం చేసేవాడే దేవుణ్ణి పూజించడానికి అరుడని భావం.

3. మామూలుగా మనం దేవళానికి వెళ్ళి దేవుణ్ణి కొలుస్తాం. కానుకలు అర్పిస్తాం. ఒక్క ఆరాధన తోనే మన బాధ్యతలన్నీ తీరిపోయాయి అనుకొంటాం. కనుక దేవళం నుండి బయటకి రాగానే తోడివారికి అపకారం తలపెడతాం. దుర్భలులను పీడిస్తాం. ఈ కీర్తన సోదరప్రేమ లేనిదే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి అతణ్ణి ఆరాధించలేమని రూఢిగా చెప్తుంది. కావున దైవప్రేమ సోదరప్రేమ వేరువేరు విషయాలు అనుకోగూడదు. ఎప్పడూ అవి రెండూ కలసే వుంటాయి. తోడి నరుణ్ణి ప్రేమించకుండా దేవుణ్ణి ప్రేమించలేం. నరుడు దేవునికి పోలికగా వుండేవాడు కదా! సోదర ప్రేమను గూర్చి ఈ కీర్తన చెప్పే అంశాల్లో మనం ఎన్నిటిని పాటిస్తున్నామో పరిశీలించి చూచుకొందాం.

18. ప్రభువు కోరేదేమిటి? — విూకా 6,6-8

1. పూర్వవేదంలోని యాజకులు దేవునికి బలులు అర్పించాలని చెప్పారు. ఇది కర్మకాండ. బహిర్గతమైన మతం. ప్రవక్తలు ఈ బహిర్గతమైన మతాన్ని నిరసించి అంతర్గత మతం ముఖ్యమని బోధించారు. హృదయంలో దేవుని మిూద నిజమైన భక్రీ, తోడి జనుల మిూద నిజమైన ప్రేమా వుంటే అదే అంతర్గత మతం. నూత్న వేదం కూడ ఈ హృదయ భక్తికే ఎక్కువ ప్రాధాన్యమిస్తుంది. ఇక్కడ మనం పరిశీలించబోయే విూకా ప్రవచన వాక్యాలు పూర్వ వేదంలోని అతిప్రశస్త భాగాలకు చెందినవి.

2. భక్తులు దేవునికి దేని వలన ప్రీతి కలిగిస్తారు? బలులు అర్పించడం వల్లనా? ఈ బలులు చాలా రకాలుగా వున్నాయి. పొట్టేళ్ళను బలియిస్తే సరిపోతుందా? దూడలను దహన బలిగా సమర్పిస్తే దేవుడు సంతోషిస్తాడా? ఓలివు తైలం మొదలైన ధాన్య బలులను కాన్కబెడితే ప్రభువు మెచ్చుకొంటాడా? మన పెద్ద కొడుకుని బలియిస్తే అతనికి ప్రీతి కలుగుతుందా? యిప్రాయేలీయులు కాకున్నా ఆనాటి కనానీయులు నరబలులు అర్పించారు కదా! ఏలాంటి బలుల వల్ల కూడా దేవుని ప్రీతి కలగదని చెప్తున్నాడు ప్రవక్త మరి అతన్ని కొలచే మార్గమేమిటి?

ప్రభువుని మెప్పించాలంటే మూడు కార్యాలు ముఖ్యం. తోడి జనుల పట్ల న్యాయాన్ని పాటించాలి, వారి యెడల ప్రేమను చూపాలి. దేవుని పట్ల వినయాన్ని ప్రదర్శించాలి. ఈ మూడింటిలో తొలిరెండు తోడి జనులకు సంబంధించినవి. మూడవది దేవునికి సంబంధించినది.

తోడివారికి అన్యాయం చేయకూడదు. న్యాయమే చేయాలి. ఇది ఆమోసు, యెషయా, యిర్మీయా మొదలైన ప్రవక్తలందరూ చెప్పిన సూత్రమే. ఇక్కడ విూకా ప్రవక్త