పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6. ఆచరణం :

మనం ప్రార్ధన జేసికున్న సత్యాన్ని జీవితానికి అన్వయంచి చూచుకోవాలి. ప్రభు వాక్యం ప్రకారం జీవించినవాడే రాతిమీద ఇల్లకట్టుకున్న బుద్ధిమంతునిలాంటివాడు (మత్త, 7:24). ఈ సందర్భంలో క్రింది ప్రశ్నలు ఉపయోగ పడతాయి. ఈ వాక్యాల్లో బైబులు ఏమైనా ఆజ్ఞాపిస్తుందా? ఈ బోధల ప్రకారం జీవితంలో నేను సరిదిద్దుకోవలసిన అంశం యేమైనా వుందా? ఆచరించవలసిన మంచికార్యం యేమైనా వుందా? ఇక్కడ బైబులు మనకేమైన వాగ్హానంచేస్తుందా? ఈ విధంగా మనం చదువుకున్న సత్యాన్ని దైనందిన జీవితంలో ఆచరణలో పెట్టే ప్రయత్నం చెయ్యాలి.

ఈలా దైవ వాక్యాన్ని ఆచరించినవాడే ప్రభువునకు మాతృతుల్యుడు, బంధువు (లూకా 11:28). కాని దైవవాక్యాన్ని చదువుకొని ఆచరణలో పెట్టనివాడు అద్దంలో తన ముఖంజూచుకొని, మల్లా ఓ నిమిషంలోనే తానేలాంటివాడో పూర్తిగా మరచిపోయిన మందునిలాంటివాడు (యాకో, 1:24) .

7. నోటుబుక్కు :

ప్రార్థనా సమయంలో ప్రభువు మనకేమైన బోధించవచ్చు. మనలోపాలను కొన్నిటిని సవరించవచ్చు. లేదా బైబుల్లోని ఓ వాక్యం మన హృదయానికి హత్తుకొనిపోవచ్చు. ఓ పవిత్రమైన అనుభూతి కలుగవచ్చు. వీటినే ఆధ్యాత్మిక జీవితంలో "వెలుగులు' అంటారు. ఈ వెలుగులను ఎప్పటికప్పడు ఓ నోటుబుక్కులో వ్రాసిపుంచుకోవడం మంచిది. ఆయా వెలుగులను అందించిన ఆయా బైబులు భాగాలను మళ్లామల్లా ప్రార్థనకు ఉపయోగించుకోవచ్చు

8. ముగింపు :

కడన ఓ చిన్న ప్రార్థనతో బైబులు పఠనం ముగించాలి. ఈ ప్రార్ధనలో ప్రభువు మనకు అనుగ్రహించిన వరప్రసాదానికి కృతజ్ఞత చూపాలి. బైబులు బోధల ప్రకారం మన జీవితాన్ని సరిదిద్దుకోవడానికి అవసరమైన వరప్రసాదాన్ని అడుక్కోవాలి.

ఇంతవరకు మనం సూచించిన నియమాలన్నింటినీ ఓ ఉదాహరణకు అన్వయించిచూద్దాం : లూకాసువార్త 11:9-10 తీసికుందాం. ప్రార్థించే విధానం నేర్పమని శిష్యులు ప్రభువుని అడిగారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రభువు ప్రార్థనను నేర్పించాడు. ఈ వాక్యాల్లోని "అడగండి" "తట్టండి" "వెదకండి" అనే పదాలు బలమైన ఉత్పేక్షలు. అనగా మనం ఎంత ప్రయత్నమైనా చేసి ప్రభుకృపతో ప్రార్థనను సాధించాలి. సంతృప్తికరంగా ప్రార్ధనం చేసామని ఎవరు చెప్పకోగలరు? కనుక ఆ శిష్యుల్లాగే మనంగూడ "ప్రభూ, మాకు జపంజేసికునే విధానం తెలీదు. మాకుగూడ ప్రార్ధన నేర్చించండి" అని వినయంతో అడుక్కుందాం. మన తరపున మనం రోజురోజు జపంజేసికునే ప్రయత్నం చేద్దాం. ఈలాగే బైబులు భాగాలను ప్రార్థనకు వాడుకోవచ్చు.