పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కడన అతడు నేనొక్కట్టే ఈ ప్రజలను భరాయించలేనని దేవునికి ఖండితంగా జెప్పివేసాడు. నీవు నాపట్ల అతి క్రూరంగా ప్రవర్తిస్తున్నావు. ఈలాగైతే నన్ను చంపివేయడమే మేలు అని తెగించి పల్మాడు.

ఐనా మోషే తన పనిని మానలేదు. ప్రజల సుమ్మర్లనూ తిరుగుబాటునూ సహిస్తూగూడ వారికి నాయకుడుగా వ్యవహరిస్తూనే వచ్చాడు. దేవుడు అతని కష్టాలను తొలగించకపోయినా తన వరప్రసాదబలంతో అతన్ని ఆదుకొంటూనే వచ్చాడు. కనుకనే మోషే నలబైయేండ్లపాటు ఆ తలబిరుసు జనంతో వేగింపగలిగాడు. తన జీవితంలోని కష్టాలన్నిటినీ సహింపగలిగాడు.

3. బాధల్లో మనం దేవునికి ప్రార్థన చేస్తాం. జపం జేసాంగదా అని దేవుడు మన కష్టాలను దిడీలున తొలగింపడు. అవి అలాగే వుంటాయి. కాని వాటిని భరించే శక్తిని మాత్రం ప్రభువు మనకు ప్రసాదిస్తాడు. అతని వరప్రసాద బలంతో మనం ముందుకి వెత్తాం. ఈలా వరప్రసాద బలంతో కష్టాలను భరించడం వలన పుణ్యాన్ని ఆర్థిస్తాం. మోక్షబహుమతికి అరుల మౌతాం. ఇది చాలు కదా!

8. అన్నా వేడికోలు - 1సమూ 19-18.

1. ఎల్మనాకు అన్నా పెనిన్నా అని యిద్దరు భార్యలు. వారిలో అన్నాగొడ్రాలు. యూదుల భావాల ప్రకారం సంతానం దేవుని వరాన్నీ బిడ్డలు లేకపోవడం దేవుని శాపాన్నీ సూచిస్తాయి. కనుక పెనిన్నానీవు గతిలేనిదానివని అన్నాను దెప్పిపొడిచేది. అన్నాదుఃఖంతో కృంగిపోయేది.

2. ఒకసారి ఎల్మానా అతని భార్యలు దేవుణ్ణి కొలవడానికి పిలో నగరానికి యాత్ర వెళ్ళారు. అన్నా అక్కడ దేవళంలోనికి వెళ్ళి దేవునిమందు బోరున ఏడ్చింది. దేవా! నాకో మగబిడ్డను ప్రసాదించావంటే వాడ్డి నీకే కానుకగా అర్పించుకొంటానని మొక్కుకొంది.

ఆమె వేదనతో హృదయంలోనే ప్రార్థన చేసికొంటూంది. భక్తిభావం వలన పెదవులు కదలుతున్నాయి గాని నోటివెంట మాటలు మాత్రం వెలువడ్డంలేదు. అంతా మౌన ప్రార్థన. మామూలుగా యూదులు పెద్దగా అరుస్తూ ప్రార్థన చేసేవాళ్ళు అన్నా ప్రార్ధన దీనికి విరుద్ధంగా వుంది. కనుక అన్నా ముఖాన్ని పరిశీలస్తున్న యాజకుడు ఏలీ ఆమె తప్పత్రాగిందేమో అనుకొన్నాడు. ఆ ద్రాక్షసారాయపు కైపు వదలించుకో అన్నాడు. కాని అన్నా అయ్యా! నేనిక్కడికి త్రాగిరాలేదు. నేను తీరని వ్యధతో బాధపడుతున్నాను. దేవునిముందు మనసువిప్పి ప్రార్థన చేస్తున్నాను అని చెప్పింది. ఏలి అమ్మా! యిప్రాయేలు దేవుడు తప్పక నీమొర ఆలిస్తాడు అని అన్నాను దీవించాడు. ఆ యాజకుని పలుకుల ద్వారా దేవుడే అన్నాకు అభయమిచ్చాడు. తర్వాత ఆమె దుఃఖం తీరిపోయింది. దేవుడు అన్నాను కరుణించి ఆమెకు సమూవేలు అనే బిడ్డట్టి ప్రసాదించాడు. 241