పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

{center|

రెండవ గీతం 49, 1=6

}

1."ద్వీపములారా! నా మాట వినండి

దూరప్రాంత జాతులారా! నా పల్ములు ఆలించండి
నేను తల్లికడుపున పడినప్పటినుండి
ప్రభువు నన్నెన్నుకొని తన సేవకునిగా నియమించాడు

2. అతడు నాకు పదునైన కత్తిలాంటి నాల్కనిచ్చాడు

తన హస్తంతో నన్ను రక్షించాడు
నన్ను వాడియైన బాణంలా తయారుచేసి
వాడుకోవడానికి తన అమ్ముల పొదిలో దాచాడు

3. అతడు నాతో యిప్రాయేలూ! నీవు నాకు సేవకుడివి

నీ వలన నాకు కీర్తి కలుగుతుంది అని చెప్పాడు.

4. నేను నిరర్థకంగా శ్రమపడ్డాను

నా బలాన్నంతటినీ వినియోగించినను

ఫలితాన్ని సాధించలేకపోయాను అనుకొన్నాను

కాని ప్రభువు తప్పక నాకోపు తీసికొని

నా కృషికి నన్ను బహూకరిస్తాడు

5. నేను మాతృగర్భాన పడినప్పటినుండి
ప్రభువు నన్నెన్నుకొన్నాడు
యాకోబును తన వద్దకు తీసికొని రావడానికీ,
యిస్రాయేలును తన చెంతకు చేర్చడానికీ
నన్ను తన సేవకునిగా నియమించాడు
ప్రభువు నాకు కీర్తిని దయచేసాడు
నా బలానికి కారకుడు అతడే

6. ప్రభువు నాతో యిూలా అన్నాడు- "నీవు నాకు సేవకుడవై

యాకోబు వంశజుల్ని, యిస్రాయేలున మిగిలినవారిని
నా యొద్దకు తీసికొని రావడం మాత్రమే చాలదు,
నేను నిన్ను జాతులకు జ్యోతిగా నియమిస్తాను
అప్పడు నా రక్షణం నేలయంచులదాకా వ్యాపిస్తుంది".

188