పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

 వేడుకోవాలి. ఐతే ఆ రోజుల్లో ఎవరుకూడ రాజు పిలువకుండానే అతని సన్నిధిలోకి వెళ్ళకూడదు.

       హామాను మొర్టెకయిని ఉరితీయించడానికి 75 మూరల ఎత్తున్న ఉరికంబాన్ని సిద్ధం చేయించాడు. ఎస్తేరు రాజును సందర్శించి అతనికి విందు చేయించింది. ఆ విందులో యూదులకు ప్రాణభిక్ష పెట్టమని వేడుకొంది. ఆ సమయంలోనే హామాను కుట్రనుగూడ రాజుకు తెలియజేసింది. హామాను తన్ను క్షమించమని అడుగుకోవడానికి పడకపై కూర్చుండివున్నఎస్తేరు కాళ్ళపై పడ్డాడు. రాజు ఈ చర్యను అపరాధంగా భావించి హామానుని అతడు మొర్టెకయి కొరకు తయారుచేయించిన ఉరికంబం మీదనే ఉరితీయించాడు. యూదులు పారశీకంలోని తమ శత్రువులను రెండు రోజులపాటు చంపారు. వాళ్ళ శత్రువులపై సాధించిన విజయాన్నేపూరీము ఉత్సవంగా జరుపుకొన్నారు. రాజు హామానుకు బదులుగా మొర్టెకయిని ప్రధానమంత్రిని చేసాడు. అతడు దేశాభివృద్ధికొరకూ, యూదుల శ్రేయస్సు కొరకూ కృషిచేసాడు.
      ఈ పుస్తకాన్ని వ్రాయడంలో గ్రంథకర్త ఉద్దేశాలు రెండు. మొదటిది, పూరీము ఉత్సవం ఎలా పట్టిందో తెలియజేయడం. రెండవది, తన్ను నమ్మి తనను శరణువేడినవారిని దేవుడు తప్పక కాపాడతాడని తెలియజేయడం. ఇక ఈ కథను ఐదు భాగాలుగా పరిశీలిద్దాం.

3. వివరణం

1. వష్టి రాణి 11, 2-1, 22

     అహష్వేరోషు తన అధికారులకు విందుచేయించాడు. ఈ విందులో తప్పత్రాగి వివేకాన్ని కోల్పోయి రాణి అధికారుల ముందు తన సౌందర్యాన్ని ప్రదర్శించాలని ఆజ్ఞాపించాడు. అభిమానమున్న ఏ స్త్రీయైనా అలాంటిపని చేస్తుందా? వష్టి రాజాజ్ఞను త్రోసిపుచ్చింది. రాజు సలహాదారులు కూడా అతనిలాంటివాళ్ళే వాళ్ళు రాణిని చూచి దేశంలోని స్త్రీలందరూ తమ భర్తలను ధిక్కరిస్తారు కనుక ఆమెను పదవినుండి తొలగించమని

రాజుకి సలహాయిచ్చారు. వష్టి పదవి పోయింది. ఇక్కడ రచయిత పారశీక రాజుల పిచ్చి పద్ధతులను ఎగతాళిచేసాడు.

2. మొర్టెకయి - ఎస్తేరు 2, 1-3, 6

    కొంతమంది అందమైన కన్నెలను రాజు అంతఃపురానికి తీసికొనివచ్చారు. వారిలో ఎస్తేరుకూడా వుంది. రాజుకు ఆమె అందం, వినయం నచ్చింది. కనుక రాజు ఆమెను పరిణయమాడి వష్టికి బదులుగా రాణిని చేసాడు. కాని ఆమె యూదస్త్రీ అని రాజుకి