పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాని యిప్పడు తాను స్వయంగా దేవుణ్ణి చూచాడు. ప్రత్యక్షానుభవం కలిగింది. ఆ యనుభవం గొప్ప వెల్లురు. ఆ వెల్లురు సోకగానే అతనిలోని చీకటి పటాపంచలైంది. అతడు తన తప్పని గుర్తించాడు. తన దురుసుతనానికి పశ్చాత్తాపపడ్డాడు.

యోబు తప్ప ఏమిటి? అతడు మంచివాళ్ళకు కష్టాలెందుకు రావాలి అని వాదించి దేవునిమీద తిరగబడ్డాడు. దేవుని స్థానే నేను న్యాయమూర్తిగా వుంటానన్నట్లు ప్రవర్తించాడు. తనకు సుఖాలేగాని కష్టాలు రాకూడదన్నట్లుగా మాట్లాడాడు. కష్టాలద్వారా దేవుడు తన్ను తిరస్కరించాడని అపోహపడ్డాడు. తాను అజ్ఞానియైగూడ మహాజ్ఞానిలాగ ప్రేలాడు. కాని దేవుడు తన దృష్టికి తెచ్చిన సృష్టివస్తువుల మాహాత్మ్యాన్ని చూచి ఇప్పడు పాఠం నేర్చుకొన్నాడు. సృష్టి వస్తువులను పట్టించుకొనే దేవుడు తన్నుగూర్చి కూడ జాగ్రత్త పడుతూనే వుంటాడు. కనుక తనకు దాపురించిన కష్టాలకు ධීක්‍ෂික ඩ්ධි” అర్థం ఉద్దేశించి వండాలి. కావున యోబు తన సాహసానికి పశ్చాత్తాపపడుతూ

"పూర్వం వినికిడివల్ల మాత్రమే నేను నిన్నెరిగితిని
కాని యిప్పడు నా కన్నులతో నిన్ను జూచాను
కనుక నేను పల్మిన పల్కులకు సిగ్గుపడుతున్నాను
దుమ్మూ బూడిదా నా మీద చల్లుకొని
పశ్చాత్తాపపడుతున్నాను"

అన్నాడు – 42, 5-6. ఇవి యోబు గుండెలు చీల్చుకొని వచ్చిన పలుకులు. చాల చిత్తశుద్ధికల వాక్యాలు.

3. పాక్షికమైన-సమస్యా పరిష్కారం

మంచివాళ్ళకు కష్టాలెందుకు వస్తాయి అని యోబు ప్రశ్న ఇదే అతని సమస్య కాని ప్రభువు యోబుకి దర్శనమిచ్చి అతనితో సంభాషించినపుడు ఈ సమస్యను అసలు ఎత్తుకోనే లేదు. యోబు తన దరుసుతనానికి పశ్చాత్తాపపడి ఊరకున్నాడు. "దుమ్మూ బూడిదా నామీద చల్లకొని పశ్చాత్తాపపడుతున్నాను" అని పలికి మౌనం వహించాడు42, 6. మాటిమాటికి తాను నిర్దోషినని వాదిస్తున్నా దేవుడు అతడు మంచివాడనిగాని చెడ్డవాడనిగాని చెప్పలేదు. అతనికి కష్టాలెందుకు వచ్చాయో తెలియజేయలేదు. మరి అతని సమస్య ఏలా పరిష్కారమైనట్లు?

యూబు దేవుణ్ణి ప్రత్యక్షంగా చూచాడు. అతని సృష్టి మాహాత్మ్యానికి విస్తుపోయాడు. సృష్టిరహస్యాలనే తెలిసికోలేని తాను ఆ సృష్టిని చేసిన దేవుని రహస్యాలను ఎంత మాత్రమూ తెలిసికోలేనని గ్రహించాడు. దేవుడు తనకు కష్టాల నెందుకు పంపాడో అసలే అర్థం