పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రభువు ఎవరి సాంబ్రాణి పొగను అంగీకరిస్తే వాళ్లే నిజమైన యాజకులు అని చెప్పాడు. కోరా సాంబ్రాణి పొగ వేస్తుండగా అగ్ని దిగివచ్చి అతన్నీ అతని అనుచరులనూ కాల్చి చంపింది. వాళ్ళు గుడారంలోనే చనిపోయారు. ప్రభువు వాళ్ళ యాజకత్వాన్ని అంగీకరించలేదని రుజువైంది.

తర్వాత యెలియాసరు కోరా బృందం కలశాలను సాగగొట్టి రేకులు చేసి పీఠానికి కప్పాడు.

దాతాను, అబీరాము రూబేను తెగకు చెందినవాళ్ళు. వీళ్ళ తిరుగుబాటు రాజకీయమైంది. వీళ్ళు వాద్దత్త భూమికి వెళ్ళడానికి నిరాకరించినవారి ముఠాకు చెందినవాళ్ళు. కనుక మోషే నాయకత్వాన్ని ధిక్కరించి తిరుగుబాటు చేసారు. మోషే పెద్దలతో వీరి గుడారాల వద్దకు వెళ్ళాడు. అక్కడ భూమి నెర్రెలు విచ్చి ఈ తిరుగుబాటుదారులను ప్రింగివేసింది. ఈలా వీళ్ళ యావే గుడారంలోగాక తమ గుడారాల దగ్గరే చనిపోయారు. దీనివల్ల ప్రభువుకి వీళ్ళ ప్రవర్తన నచ్చలేదని తెలిసిపోయింది.

తర్వాత ప్రజల మోషే అహరోనులమీద గొణగారు. మీరు ఇంతమందిని చంపించారుగదా అని తిరుగుబాటు చేసారు. ప్రభువు ఆ ప్రజలపై కోపించి అంటురోగాన్ని పంపగా వారిలో 14, 700 మంది చచ్చారు. అపుడు అహరోను మధ్యవర్తిగా నిల్చి దేవునికి సాంబ్రాణి పొగవేసి అంటురోగాన్ని ఆపివేసాడు. అతడు సాంబ్రాణి పొగవేయడం విజ్ఞాపన ప్రార్ధన లాంటిది.

అహరోను కుటుంబం మాత్రమే యాజకులుగా పనిచేయాలి అనే అంశంమీద ప్రజల్లో ఇంకా అనుమానాలున్నాయి. కనుక ప్రభువు ఈ సందేహాలను తొలగింపగోరాడు. అతని అనుమతిపై మోషే పండ్రెండు గోత్రాల వారిచే 12 కర్రలు తెప్పించి గుడారంలో పెట్టించాడు. ప్రతి కర్రమీద గోత్రం పేరుంది. చివరకు లేవీ తెగపాడైన అహరోను కర్ర చిగిర్చి బాదము పండు కాసింది. కనుక ప్రభువు ఆ కుటుంబాన్నే యూజకులుగా ఎన్నుకొన్నాడని తేలిపోయింది. అంతటితో ప్రజలు వాగుడు ఆగిపోయింది. ఇది బైబుల్లోని ప్రసిద్ధ కథల్లో వొకటి.

కోరా, దాతాను కథలు మనకు నేర్పేదేమిటి? దేవుడు ఈయనొల్లని పదవులను ఆశించకూడదు. అది అహంకారమౌతుంది. ఇంకా దేవుడు నియమించిన నాయకులను అంగీకరించాలి. వారిని నిరాకరిస్తే దేవుట్టే నిరాకరించినట్లు. దేవుని ప్రతినిధుల్లో దేవుడుంటాడు.